నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ డాకు మహారాజ్. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా అంచనాలను రెట్టింపు చేసేలా ఫస్ట్ సింగిల్ ప్రోమోనో రిలీజ్ చేశారు మేకర్స్.
డాకు రేస్ లిరికల్ పేరుతో ఈ వీడియోను రిలీజ్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారుతుంది. ఇక ఈ వీడియో బ్లాస్ట్ కాయమనేలా.. కేవలం విజువల్స్ తోనే బాలయ్య ర్యాంపేజ్ చూపించాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. డేగ డేగ అంటూ సాగే ఈ సాంగ్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. నకాష్ అజీజ్ ఆలపించారు.
ఇక ఈ సాంగ్ తో మాస్ విధ్వంసం సృష్టించేలా డిజైన్ చేశారు. సౌండ్ వరల్డ్ ఆఫ్ డాకు అనే రేంజ్‌లో సాంగ్ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం లనేంతల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్యూన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. మాస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా బాలయ్య నిలవడం కాయం అనంతల విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక డాకు మహారాజ్‌తో మరోసారి బాలయ్య ఊచకొత ఖాయం అంటూ సింగిల్ ప్రోమో చూసినా ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.