సుకుమార్ రెడ్డి కాదు… సుకుమార్ నాయుడు… బ‌న్నీ పేర్లు మార్చేస్తున్నావా..?

ఐకాన్‌ స్టార్ పుష్ప ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్‌ టాక్ తెచ్చుకుని.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. తాజాగా ఢిల్లీలో ఈవెంట్ జ‌ర‌గ‌గా ఇందులో బన్నీ మాట్లాడుతూ పుష్ప ది రూల్స్ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ రెడ్డీదే అంటై కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. థాంక్స్ మీట్ లో భాగంగా బన్నీ మాట్లాడుతూ.. త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాడు. థాంక్స్ ఇండియా.. ఈ సినిమాకు ఇంతటి గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చిన బన్నీ.. ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్ అంటూ కామెంట్‌లు చేశాడు.

Sukumar wants this, while Allu Arjun wants that | Telugu Cinema

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, సినీ ప్రేమతో పాటు.. ఎగ్జిబిటర్లు, మూవీ టీమ్ అందరికీ ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి ఆయ‌నే బండి సుకుమార్ రెడ్డి అంటూ వివ‌రించాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సుకుమార్ పూర్తి పేరు చాలామంది ప్రేక్షకులు తెలియదు. అయితే బన్నీ తన కామెంట్లు ద్వారా సుకుమార్ పూర్తి పేరు గురించి చెప్పేశాడు. కానీ.. సుకుమార్ అసలు పేరు బండి సుకుమార్ నాయుడు.. రెడ్డి కాదు. ఈ క్రమంలోనే బన్నీ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.

Allu Arjun Pronounced Sukumar Name Incorrectly | Pushpa 2 Thank You India  Press Meet | Daily Culture

దీంతో ఆయనపై పలు నెగటివ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ కు మరి రెడ్డిల పైన ప్రేమ మరింత ఎక్కువైందని.. ఈ క్రమంలోనే సుకుమార్‌ను కూడా రెడ్డిని చేసేసాడు అంటూ.. సుకుమార్ రెడ్డి కాదు.. సుకుమార్ నాయుడు పేర్లు మార్చేస్తున్న బన్నీ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది.. అసలు సుకుమార్ పూర్తి పేరు తెలియని వారు నిజంగానే సుకుమార్.. రెడ్డి అని భావించేలా అంత కాన్ఫిడెంట్గా ఆయన పేరు పలికావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ చేసినా కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.