సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో రాజమౌళి తీసిన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. ఈ క్రమంలోనే సుకుమార్ రాజమౌళి భయాన్ని నిజం చేసేసాడు అంటూ.. జక్కన్న పేరు కన్నా సుకుమార్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ పై కాన్సెంట్రేట్ చేశాడు.. అదే ఆయన మాస్‌ను సీరియస్‌గా తీసుకుంటే మేమంతా వెనకబడిపోతాం అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో సుకుమార్ తర్వాత ఒక్కో సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సినిమాలన్నీ భారీ సక్సెస్ అందుకుంటున్నాయి. రంగస్థలంతో రూట్ మార్చేసి కమర్షియల్ పాల్స్ పట్టుకున్న సుక్కు తన సత్తా చాటుకున్నాడు. పుష్ప సినిమా కంప్లీట్ మాస్‌తో రూపొందించి తనలో ఉన్న ఎన్నో వేరియేషన్స్ ను పాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకున్నాడు.
ఈ సినిమా నేషనల్ వైడ్‌గా ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూస్తూనే ఉన్నాం. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో మరిన్ని కలెక్షన్లు బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేయడం కాయం. ఇప్పటికే రాజమౌళి ఎన్నో సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తే.. ఆ సినిమాలన్నీ రికార్డులను ఒకే ఒక్క సినిమాతో సుకుమార్ బ్రేక్ చేసి రాజమౌళి కన్నా సుకుమార్ గ్రేట్ అని నిరూపించుకున్నాడు. అయితే పుష్ప సినిమాతో రాజమౌళి ఆర్‌ఆర్ఆర్, బాహుబలి లతో తెచ్చుకున్న అంత బ్రాండ్ మాత్రం సుక్కు అందుకోలేకపోయాడు.
సో ఇప్పుడు చరణ్‌తో తెరకెక్కించే సినిమాతో సుకుమార్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందుకుంటాడని.. ఆ ప్రాజెక్ట్ పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసేలా స్టోరీ ఉండబోతుందని సమాచారం. ఇక ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న స్టార్ హీరోలు సుకుమార్ తో సినిమా చేయడానికి ఆరట పడుతున్నారు. మహేష్ ను ఆయన ఫ్యాన్స్ సుకుమార్ తో సినిమా చేయాలంటూ కోరుకుంటున్నారు. రాజమౌళితో మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో.. సుకుమార్ రికార్డులను జక్కన్న బ్రేక్ చేయగలడో.. లేదో.. అని టెన్షన్ మహేష్ బాబు అభిమానుల్లో మొదలైంది. ఎస్ఎస్ఎంబి 29 ఎప్పటికీ మొదలు కాలేదన్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి కాంబో సినిమాపై ఎన్నో సందేహాలు వినపడుతున్నాయి.