టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో గురువారం గ్రాండ్ లెవెల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌లో పాటు.. మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ యార్నేని, వై. రవిశంకర్.. అలాగే డిస్ట్రిబ్యూటర్లు షోలు ప్రదర్శించిన యాజమాన్యం కూడా పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా బన్నీ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ దేశం మొత్తానికి చెందుతుందని వెల్లడించాడు.
ఒక సినిమాతో దేశం మొత్తం వేడుక చేసుకుంటుందని.. తగ్గేదేలే అన్న మాట విన్న ప్రతిసారి ఆనందంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పాత్ర కేవలం సినిమాకు సంబంధించినది కాదని.. ప్రతి భారతీయుడు వైఖరిలా మారిపోయిందని అల్లు అర్జున్ వివరించాడు. ఇక బాలీవుడ్ ఆడియన్స్ సినీ ఇండస్ట్రీ లేకపోతే పుష్ప ఈ రేంజ్ కు వచ్చేది కాదని,, ఈ విజయం వెనుక ఎంతోమంది కష్టం ఉందంటూ వెల్లడించాడు. ఇక సినిమాకు వచ్చిన కలెక్షన్లు నెంబర్ తాతకాలికమే.. కానీ ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపోతుందంటూ అల్లు అర్జున్ వెల్లడించాడు.
అంతేకాదు.. ఓ వ్యక్తికి మాత్రం స్పెషల్ గా కృతజ్ఞతలు తెలపాలని ఆయనే సుకుమార్ అంటూ వెల్లడించాడు. సుకుమార్ విజయం నుంచి పుట్టిన సినిమానే ఇది. ఇక ఈ సినిమాకు సరికొత్త రికార్డులు వస్తూనే ఉండాలి. పాత రికార్డులు బ్లాస్ట్ అవుతూనే ఉండాలి.. వేసవిలోపు తెలుగు సినిమానే కాదు ఇతర ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా రికార్డును బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అదే మన ప్రోగ్రెస్ కి నిదర్శనంగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక మేకర్స్ వై . రవిశంకర్, అలాగే డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని సినిమా రూ.2000 కోట్ల మైలు రాయిని చేరుకుంటుంది అంటూ ఆశ భావాన్ని వ్యక్తం చేశారు.