లక్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 హిట్ అయిందా.. బన్నీ నెక్ట్స్ సినిమాకు ఇన్ని క‌లెక్ష‌న్లు రావా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటు ఉంటాయి. అయితే టాలీవుడ్ సినిమా నార్త్ లో రిలీజై సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది కలెక్షన్ల పరంగా దూసుకుపోవ‌డ‌మంటే సులువైన పని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన వారే సరైన ఆఫర్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బన్నీకి లెక్ క‌లిసొచ్చి పుష్ప 2 హిట్ అయిందని.. ఆయన నెక్స్ట్ సినిమాలు ఈ రేంజ్ లో కలెక్షన్లు కొల‌గొట్టడం కష్ట‌మే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప 1కు సీక్వెల్ కనుక.. పుష్పదిరూల్ కు బాలీవుడ్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయని.. బన్నీ, త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అసలు అనుకోలేము. గతంలో ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2 లతో అక్కడ మంచి సక్సెస్ అందుకొని భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన తర్వాత ఆయన నుంచి వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్‌కు బాలీవుడ్‌కు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2కు బాలీవుడ్లో వచ్చినంత రెస్పాన్స్ తెలుగు రాష్ట్రాల్లో రావడం లేదనేది ఫ్యాక్ట్. పుష్ప ది రూల్ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు ఆరు రోజుల్లోనే రాబ‌ట్ట‌డం అంటే అది సాధారణ విషయం కాదు. సినిమా ధియేట్రిక‌ల్‌ హక్కులు రిలీజ్‌కు ముందే భారీ ధరకు అమ్ముడుపోయాయి.

ఈ క్రమంలోనే పుష్పది రూల్ సినిమా ఫుల్ టైం కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో చూడాలని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక సినిమా రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో కూడా డ‌బ్ అయ్యు విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. బన్నీ రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో తీసుకున్నాడని సమాచారం. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే వేగంగా సినిమాలో నటిస్తానంటూ బన్నీ ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. పుష్ప 2 రేంజ్ లో కంటెంట్ ఎంచుకుని అదే రేంజ్‌లో బన్నీ సక్సెస్ అవుతాడా.. లేదా.. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో వేచి చూడాలి.