2024 టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ ముద్దుగుమ్మలు ఎవరంటే ..?

ఇక ప్రస్తుతం 2024 చివరి దశకు వచ్చేసింది .. ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. 2024 సంవత్సరం టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు అడుగుపెట్టారు.. అలా వచ్చిన హీరోయిన్లు తమ నటన అభినయంతో తమ అందంతో తమదైన ముద్ర వేసుకున్నారు .. టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముకుందన్ వంటి వారు ఎంతో ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు .. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ఏ హీరోయిన్లు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అనే వివరాలు ఇక్కడ చూద్దాం . దీపికా పదుకొనే : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సంవత్సరం తెలుగు తెరకు పరిచయమైంది .. హీరోయిన్గా కెరియర్ మొదలపెట్టి 15 ఏళ్లకు కల్కి 2898 ఏడి సినిమాతో దీపికా పదుకొనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు .. ప్రభాస్ నాగస్విన్ కాంబినేషన్లో విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాలో సుమతి పాత్రలో నటించారు దీపిక .

Janhvi Kapoor (@janhvikapoor) • Instagram photos and videos

అన్నా బెన్: కల్కి 2898 ఎడి మూవీతో ఈ మలయాళీ నటి అన్నాబెండ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు .. ఈ సినిమాలో కైరా పాత్రలో కాసేపు నటించి ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే: రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ పర్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌కు పరిచయమయ్యారు .. హరీ శంకర్ డాడ్సికత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా నేర్పించలేకపోయింది. జాన్వీ కపూర్ : దేవరాజ్ సినిమాతో జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన జాన్వి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి పాన్ ఇండియా హిట్ను తన ఖాతాలో వేసుకుంది .. ప్రస్తుతం జాన్వి తెలుగులో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవరాట్టు లో కూడా నటిస్తుంది. ప్రీతి ముకుందన్: టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రతి ముకుందన్ .. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళనాడులోని తిరుచ్చులు పుట్టి పెరిగింది .. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్రిచి నుంచి ఎలక్ట్రిక్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టాను పొందింది. రుక్మిణి వసంత్: అప్పుడు ఇప్పుడు ఎప్పుడో సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. 2023 లో ఆమె రొమాంటిక్ సప్త సాగరాలు, ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బి తో తెలుగువారికి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ నిఖిల్ అప్పుడు ఇప్పుడు సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది.

Deepika Padukone - Wikipedia

మాన్షి చిల్లర్: ప్రపంచ సుందరి 2017 కిరీటం దక్కించుకున్న మాన్సీ చిల్లర్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిందిపంఖురి గిద్వానీ –ఫెమినా మిస్ ఇండియా 2016 రన్నరప్‌ పంఖురి గిద్వానీ 2024లో నవదీప్ సరసన లవ్ మౌళి అనే రొమాంటిక్ డ్రామాలో నటించి తెలుగు అరంగేట్రం చేసింది.అతిర రాజి –మలయాళ నటి అతిరా రాజీ 2024లో, సత్య దేవ్‌కి జోడీగా కృష్ణమ్మ అనే ఇంటెన్స్ డ్రామాతో తెలుగు అరంగేట్రం చేసింది.సిరి లెల్ల –సిరి లెల్ల 2024 పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి 2లో తన అరంగేట్రం చేసింది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతినిధి (2014)కి సీక్వెల్. సిరి లెల్లా నారా రోహిత్ కు జంట‌గా నటించి ఏకంగా రియల్ లైఫ్ జోడీగా మారనుంది. సంయుక్త విశ్వనాథన్ : సంయుక్త విశ్వనాథన్ 2024లో వెన్నెల కిషోర్ హీరోగా వ‌చ్చిన‌ స్పై యాక్షన్ కామెడీ చిత్రం చారి 111 మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. భూమి శెట్టి: కన్నడ-భాషా టెలివిజన్ సిరీస్ కిన్నారిలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన నటి భూమి శెట్టి 2024లో చైతన్య రావు షరతులు వర్తిస్తాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నయన్‌ సారిక: హీరోయిన్‌ నయన్‌ సారిక 2024లో ఏకంగా మూడు సినిమాలు చేసింది. అనంద్‌ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’తో టాలీవుడ్ కి పరిచయమైన ఆమె నార్నే నితిన్‌ ‘ఆయ్‌’, కిరణ్‌ అబ్బవరం ‘క’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. తన్వీ రామ్ : ఇక కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తన్వీ రామ్‌.