ఇక గతంలో రాజమౌళి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడి పోతామని చెప్పడం అప్పట్లో ఎంతో వైరల్ అయింది .. జగడం లాంటి డార్క్ యాక్షన్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ని రాజమౌళి ఎంతగానో ఇష్టపడతారు .. ఆ సీన్లు అందరూ వెనక్కు వెళుతుంటే రౌడీ మొకకు రామ్ ఒక్కటే ఎదురు వెళ్లే సీన్ ఓ రేంజ్ లో పేలింది . కానీ తర్వాత ఆర్య సినిమా నుంచి నాన్నకు ప్రేమతో వరకు సుకుమార్ స్టైల్ సిటీ ప్రేక్షకులను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది . రంగస్థలంతో రూటు మార్చడమే కాదు కమర్షియల్ పల్స్ మీద తన పట్టుని చూపించాడు.
ఇప్పుడు పుష్ప2 1000 కోట్ల గ్రాస్ సాధించడం చూశాక అప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవ్వాళ సుకుమార్ నిజం చేసి చూపించారు . ఫాంటసీ టచ్, జానపదం, మల్టీస్టారర్, భారీ టెక్నికల్ హంగులు ఏమీ లేకుండా ఒక ఎర్రచందనం దొంగ కథతో పాన్ ఇండియా రికార్డులు బద్దల కొట్టడం మామూలు విషయం కాదు . బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు కానీ దానికి అంతకంతా వెనక్కు వచ్చేలా నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తీయటం మాత్రం గొప్ప విషయమనే చెప్పాలి .. అలాగే అల్లు అర్జున్ కు జాతి అవార్డుతో పాటు అంతకుమించి ఎన్నో మైలురాళ్లను ఆయన సినీ జీవితంలో సాధించారు.ఇప్పుడు రాజమౌళికి దీటుగా సుకుమార్ స్టామినా ఎంటో ప్రపంచానికి చాటి చెప్పాడు . అయితే ఇది ఇక్కడితో ఆగదు .. పుష్ప క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది .. బాహుబలి త్రిబుల్ ఆర్ ప్రభాస్ , చరణ్ , ఎన్టీఆర్ తో పాటు జక్కన్న బ్రాండ్ బలంగా సినిమాపై రిజిస్టర్ అయింది .. కానీ సుకుమార్ కు ఇంకా అది రాలేదు .. సో ఇప్పుడు రామ్ చరణ్ తో చేసే తర్వాత సినిమాలో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలి .. ఇప్పటికీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ కాంబోనే కాబట్టి అభిమానులు సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు .. అలాగే పుష్ప3 ది రాంపేజ్ ఉంటుందా లేదా అనేది కూడా కాలమే సమాధానం చెప్పాలి .. కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఎక్కువగా వెయిట్ చేయక తప్పదు.