బాలయ్య సినీ కెరీర్‌లో అఖండ ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపులతో బాలయ్య సతమతమవుతున్న టైంలో అక్కడ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు.. బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే బోయపాటి, బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2ను కూడా నటించడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. అయితే ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన క్రమంలో వెంటనే అఖండ 2 సెట్స్ లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చాడని టాక్. ఇక బోయపాటి – బాలయ్య కాంబో అంటేనే బ్లాక్ బాస్టర్ కాంబో అని బాలయ్య ఫ్యాన్స్ లో గట్టి నమ్మకం.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న అఖండ 2 ఆడియన్స్‌లో పిక్స్ లెవల్ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. బాలయ్య సినీ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఇలాంటి క్రమంలో అఖండ 2 ప్రొడక్షన్ విషయంలో ఫస్ట్ పార్ట్ సీక్వెల్ కు మధ్య చిన్న మార్పులు ఉన్న సంగతి తెలిసిందే. అఖండ మొదటి భాగాన్ని మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేయగా.. ఇప్పుడు ఆయనకు సీక్వెలతో ఎలాంటి సంబంధం లేదట. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్విని ప్రొడక్షన్‌లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై అకండ 2ను నిర్మించనున్నారని సమాచారం.
రవీంద్రరెడ్డి సీక్వెల్ కూడా నిర్మిస్తారని మొదట వార్తలు వినిపించినా.. ఇప్పుడు రామ్ ఆచంట, గోపి ఆచంట చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వారు బాలయ్య డబ్బ్ సొంతం చేసుకున్నారు. దీంతో పాటే అఖండ 2 డీల్స్ కూడా వారు సొంతం చేసుకున్నారట. ఈ విషయంలో బాలయ్య సమర్థవంతంగా పనిచేశారని టాక్ నడుస్తుంది. ఆర్థిక విషయాల్లో సరైన రీతిలో చర్చించుకున్న తర్వాతే.. మిరియాల రవీందర్ రెడ్డి నుంచి టైటిల్, కంటెంట్ హక్కులు పొందినట్లు సమాచారం. అలా సినిమా ప్రొడక్షన్ విషయంలో డీల్స్ అన్ని ఏ ఇబ్బంది లేకుండా జరిగేలా ప్లాన్ చేశాడట బాలయ్య. అంతేకాదు.. అఖండ సీక్వెల్ రిలీజ్ డేట్ కూడా ప్రస్తుతం ట్రేండింగ్‌గా మారింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.