టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రప రప రికార్డుల ఊచకోత కోస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ ఇప్పటికే కలెక్షన్ల పరంగా వెయ్యికోట్ల క్లబ్‌లో జాయిన్ అయినా ఈ సినిమా రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పుష్ప మానియా కొనసాగుతుంది. పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ మేనరిజం ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ పిక్స్ లెవెల్‌లో పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ వేసుకున్న కాస్ట్యూమ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది.
ఈ సినిమాల్లో పుష్పరాజ్.. భన్వర్ సింగ్ షేకావతతో.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెప్పే క్రమంలో ఆయన వేసుకున్న షట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. బీరపువ్వు రంగు ఇక్కత్ సికో పట్టు షర్టును బన్నీ ఈ సీన్లో ధరించాడు. అయితే షట్ స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా.. ఈ ఎక్కత్ పట్టు కాస్ట్యూమ్ పోచంపల్లి చేనేత కార్మికులు నేసిందట. ఇప్పుడు మార్కెట్లో అల్లు అర్జున్ వేసుకున్న ఈ ఇక్కత్ డిజైన్ చేనేత వస్త్రాలు ట్రెండింగ్ మారాయి. భారత సాంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రతికగా పోచంపల్లి చేనేత వస్త్రాలను చెబుతూ ఉంటారు. ఇక్కడ కళాకారులు స్వయంగా నేచిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళ్ళకులీనుతూ ఉంటాయి.
ఇక్కత్ వస్త్రాలు ఫ్యాషన్ ప్రో డిజైనర్లను విపరీతంగా అకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇదే కాదు పుష్ప 2లో చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ వేసుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ పట్టుతోనే చేసినవేనట. పుష్ప 2 సినిమా షూట్‌టైంలో పోచంపల్లిలో మూడు రోజులపాటు టీం మొత్తం ఉన్నారు. ఈ క్రమంలోనే పోచంపల్లి వచ్చిన యూనిట్ ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారని.. పోచంపల్లి వస్త్ర వ్యాపారులు వెల్లడించారు. తము నేసిన ఇక్కత్ సీకో పట్టు వస్త్రాలనే బన్నీ వేసుకున్నాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం నేను చేసిన వైరల్ అవడంతో ఇక్కత్ వస్త్రాలకు డిమాండ్ బాగా పెరిగింది.