సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో మెగాస్టార్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. చిరంజీవి క్రియేట్ చేసిన సక్సెస్లు ఆ రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా ఆయన తన ఫ్యామిలీ నుంచి భారీ సపోర్ట్ అందుకుంటున్నాడు. అలాగే వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి రావడానికి కూడా మెయిన్ పిల్లర్గా నిలిచాడు. కనుక.. ప్రతి ఒక్కరు చిరంజీవికి కృతజ్ఞత చూపిస్తూ ఉంటారు.
దానివల్ల మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎంతమంది హీరోలు ఉన్నా.. మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే.. వాళ్ళందరూ చేస్తున్న సినిమాల పైన ఎక్కువగా ఇండస్ట్రీలో మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాదాపు ఈ హీరోల నుంచి ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కేవలం పెద్ద హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా మీడియం సినిమాల్లో నటిస్తూ దర్శకులకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన మెగా సామ్రాజ్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు.
దానికి తగ్గట్టుగానే చిరు ఏడు పదుల వయసులోనూ.. సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ రాణిస్తున్నాడు. ఇది నిజంగానే మెగాస్టార్ కెరీర్‌లో చాలా గొప్ప విషయం. ఏదేమైనా తమ కుటుంబానికి ఓ ప్రత్యేకత సంపాదించడానికి మెగా ఫ్యామిలీలో ప్రతి హీరో ఎంతగానో ఆరాటపడుతున్నారు. అందుకే.. ప్రతి మెగా హీరో వైవిధ్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ.. వీరిలో చాలామంది సరైన సక్సెస్ కోసం సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇక భారీ సక్సెస్ సాధించిన వారు ఎవరు అంటే ప్రస్తుత జనరేషన్ హీరోలలో మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ తప్పుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కేవలం రామ్ చరణ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. మిగతా హీరోలంతా తమ సత్తా చాటుకోలేక.. ఇండస్ట్రీలో ఢీలా పడుతున్నారు. ఇక ఫ్యూచర్లో అయినా ఈ హీరోలు తమ సినిమాలతో సత్తా చాటుకుని సక్సెస్ అందుకుంటారు లేదో చూడాలి.