సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాయి. అలాగే కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలవగా మరికొన్ని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో రిలీజ్ అయి టాక్ వచ్చేవరకు ఎవరికీ తెలియదు. ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మొదట ఒక కథకు అనుకున్న హీరో, హీరోయిన్లు కూడా మారిపోతూ ఉంటారు. ఏవో కారణాలతో హీరో సినిమాను రిజెక్ట్ చేయడం, లేదా హీరోయిన్ సినిమాను రిజెక్ట్ చేయడం.. ఇలా ఎన్నో సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అలా టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ కాంబోలు మిస్ అయ్యాయి. అలాంటి వాటిలో అనుష్క, పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్ అయ్యిన బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉందట.
ఇంతకీ ఆ సినిమా ఏంటో.. అసలు అది మిస్ కావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. పవర్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా గెలిచిన సినిమాల్లో బంగారం మూవీ కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన పాత్ర కోసం మొదటి అనుష్కను అనుకున్నారట. త్రిషకు ఈ సినిమాలో లాస్ట్ మినిట్ లో ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ డైరెక్టర్.. అనుష్క శెట్టితో చేయాలని ఊహించుకున్నాడట. కానీ అనుష్క శెట్టి ఆఫర్ రిజెక్ట్ చేసిందట. కేవలం ఒక్క సీన్ కోసం సినిమాలో నటించాలా.. అసలు ఆ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుంది అని సినిమాను రిజెక్ట్ చేసేసిందట. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ అంతా ఆమెపై ఫైర్ అవుతూ విపరీతంగా ట్రోల్స్ కూడా చేశారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కూడా ఆమెపై కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ మరోసారి వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుతున్నాడు. అయితే అనుష్క శెట్టి మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఘాజీ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది.