బాలయ్య.. అఖండ 2, తారక్.. దేవర 2 రిలీజ్ ఎప్పుడంటే.. నందమూరి హీరోల టార్గెట్ అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సక్సెస్‌లతో బాలయ్య ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలయ్య రాబోయే సినిమాలపై కూడా ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో అఖండ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా త్వరలో అఖండ 2 తెరకెక్కనుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇక భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్.. ఎప్పుడు వస్తాయో అంటూ.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో అఖండ 2పై ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.

The massive combo Balayya- Boyapati is back with 'Akhanda 2 – Thandavam'

అఖండ 2 వచ్చేయడాది దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారట‌. ఇక అఖండ సినిమాకు ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమా బాలయ్యకు.. మరోసారి సంచలన సక్సెస్ అందించడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మొదటి నుంచి దసరా పండుగ కానుకగా రిలీజ్ అయిన నందమూరి హీరోల సినిమాలన్నీ అంచనాలను మించి సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. అలా బాలయ్య భగవంత్ కేసరి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా దసరా కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దసరా సెంటిమెంట్ ను బాలయ్య మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడట.

Devara Box Office Collection Day 2: Jr NTR Starrer Enters Rs 100 Crore Club  In Two Days - News18

ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేవర బ్లాక్ బ‌స్టర్ అందుకున్న ఆయ‌న‌ ప్రస్తుతం వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాలో కనిపించనున్నాడు. అయితే దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్ ను తారక్ ఫాలో కానున్నాడని.. ఈ క్రమంలోనే 2026 దసరా కల్లా దేవర పార్ట్‌2ను కూడా పూర్తి చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం దసరా సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో.. బాలయ్య అఖండ 2 చేయడానికి ప్లాన్ చేస్తుంటే.. తారక్ ఆపై ఏడాది దేవర 2 రిలీజ్ అయ్యేలా వ్యూహం రచిస్తున్నాడట. ఇలా నందమూరి హీరోలంతా దసరాను టార్గెట్ చేసుకుని తమ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది.