సాధారణంగా బయట ప్రపంచంలో ఒక ఫ్యామిలీకి చెందిన వారసులంతా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులుగా బ్యబహరిస్తు ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఓకే వృతిలో కొనసాగడం కామన్. ఇది పెద్ద వింత కాకపోయినా ఒక కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వారసులు అదే పోస్టులో కొనసాగుతుంటే వాళ్ల గురించి జనం కూడా స్పెషల్ గా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి కూడా అలాంటి ఓ వార్త వైరల్ గా మారుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన సత్తతో మెగాస్టార్ గా ఎదిగితే.. ఆయన బాటలోనే తమ్ముడు పవన్, నాగబాబులు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఇక పవన్.. పవర్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. నాగబాబు హీరోగా సక్సెస్ అందుకోకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయాడు. పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా ను వ్యవహరించాడు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఇక ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ సినీ రంగంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి.. రాజకీయ రంగంలోనూ ఎంట్రీ ఇచ్చాడు. తనకు విపరీతమైన క్రేజ్ ఉన్న క్రమంలో సొంతంగా పార్టీని స్థాపించి సక్సెస్ అవ్వాలని ప్రయత్నించాడు. ఇక అన్నయ్య పార్టీ పెట్టిన వెంటనే తమ్ముళ్ళు కూడా అందులో భాగమయ్యారు. పార్టీ అధికారంలోకి వస్తుందని చిరంజీవి భావించిన అది జరగలేదు.
దాంతో ఆయన పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా వ్యవహరించారు. తన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి దూరమైపోయారు. ఇక ప్రస్తుతం చిరుబాటలోనే పవర్ స్టార్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. సొంతంగా ఆయన జనసేన పార్టీని స్థాపించి దారుణంగా ఓడిపోయిన తర్వాత తాజా ఎన్నికల్లో అద్భుత సక్సెస్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు.
ఏపీ కూటమి ప్రభుత్వంలో 100% సక్సెస్ అందుకుని ఏపీ డిప్యూటీ సీఎం గా మారాడు. ఈ క్రమంలోనే జనసేనలో కీలక పాత్ర పోషించిన పవన్ అన్న.. నాగబాబు కూడా త్వరలో మంత్రి కానున్నాడట. ఒకే కుటుంబం నుంచి ఇప్పటివరకు ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పని చేయడం.. అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడం సరికొత్త రికార్డ్. ఒకప్పుడు చిరంజీవి కేంద్రంలో మంత్రి అయితే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ సీఎం కాగా, ఆయన అన్నయ్య నాగబాబు మంత్రి కానున్నాడు. ఈ క్రమంలోనే ఈ మెగా బ్రదర్స్ రికార్డును ఇప్పట్లో ఏ స్టార్ ఫ్యామిలీ టచ్ చేయడం అసాధ్యం అంటూ.. మెగా అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.