పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాదు.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంటుంది. ప్రభాస్ ఓ సినిమా చేశాడంటే.. టాక్‌తో సంబంధం లేకుండా.. కచ్చితంగా అది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇటీవల ప్రభాస్ వరుస సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్ చివరిగా నటించిన కల్కి 2898 ఏడి ఏరేంజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే.
ఈ సినిమా కలెక్షన్‌లపరంగా వెయ్యు కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇక ఈ సినిమాకు ముందు రిలీజైన సలార్ సీజ్ ఫైర్ మంచి టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ.700 కోట్లు కొట్గొట్టింది. ఈ రెండు సినిమాల వసూళ్లతో సంచలనం క్రియేట్ చేశాడు ప్రభాస్. ఇక ప్రభాస్ దెబ్బకు 2024లో గూగుల్ తల్లి బ్లాస్ట్ అయింది అంటూ సమాచారం. ఇంతకీ మేటర్ ఏంటో చెప్పలేదు కదా.. 2024 లో ప్రముఖ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ google సెర్చ్ లో.. టాప్ ట్రెండింగ్ లో ఉన్న తెలుగు సినిమాల్లో రెబల్ స్టార్ మానియా కొనసాగుతుంది.
కేవలం ఈ టాప్ 10 లిస్ట్‌లో 3 సినిమా అల్లు నిలువగా.. వాటిలో రెండు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. google అఫీషియల్ గా దీనిని ప్రకటించింది. 2024కు సంబంధించిన సినిమాలను ఎక్కువమంది సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అలా.. టాప్ ట్రెండింగ్‌లో కల్కి 2898 ఏడి టాప్ 2 లో నిలవగా.. సలార్ టాప్ సెవెన్ లో నిలిచి ప్రభాస్ ఖాతాలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ప్రస్తుతం ఇండియా వైడ్‌గ ఇది తెగ వైరల్ అవ్వడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజి షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి తన సినిమాలతో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడు వేచి చూడాలి.