సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఎక్కడ చూసినా పుష్ప న్యూస్.. పుష్ప రికార్డుల మొత్తం మోగిపోయింది. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టి అంత మార్చేశారు. సడన్గా సీన్లోకి మోహన్ బాబు కుటుంబ గొడవలు, నాగబాబు మంత్రి పదవి ఎంటర్ అయ్యి.. పుష్పరాజ్‌ను వెనక్కితోశాయి. ఇందులో మొదటి స్థానంలో మోహన్ బాబు ఫ్యామిలీ.. తాజాగా మోహన్ బాబుకి.. చిన్న కొడుకు మనోజ్‌కి మధ్యన మనస్పర్ధలతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. మనోజ్ రెండో పెళ్లి వారిమధ్య మరింత దూరం పెంచిందని.. కుటుంబ కలహాలు చిలికి గాలివానలుగా మారాయని.. ఇటీవల జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది.
తండ్రి, కొడుకులు ఇద్దరు.. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకోవడం.. మీడియా పై మోహన్ బాబు చేసిన దాడి ఇవన్నీ ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. మీడియా స్పేస్‌ని పూర్తిగా ఆక్రమించేశాయి. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో అడుగుపెట్టనున్నారని.. జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలో పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉందని.. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక నాగబాబు ఏ శాఖలో మంత్రిగా ఉండనున్నారు.. అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేకున్నా దీనిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
నాగబాబు అంటే అసలు నచ్చనివారు గతంలో ఆయన చేసిన కామెంట్స్‌ని.. వీడియోస్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏదేమైనా న్యూస్ ట్రెండింగ్‌లో.. నాగబాబు మంత్రి పదవి టాప్ 2 లో నిలిచింది. మొన్నటి వరకు టాప్ ట్రెండింగ్ లో ఎవరు టచ్ చేయని పొజిషన్‌ను సాధించుకున్న పుష్ప.. ఇప్పుడు మూడో పొజిషన్‌కు చేరుకుంది. పుష్ప క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ చాలానే ఉన్నా.. కేవలం మోహన్ బాబు, నాగబాబు టాపిక్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో పుష్ప 2 సక్సెస్ మీట్స్‌ను ప్రమోషన్స్ రేంజ్ లో భారీగా ప్లాన్ చేస్తుందని.. పాపులర్ నగరాలలో పుష్ప 2 సక్సెస్ మీట్ జరగనుందని తెలుస్తోంది. దీంతో మరోసారి పుష్ప 2 నెంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వస్తుందో.. లేదో.. వేచి చూడాలి.