సీనీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఎంత సినీ బ్యాగ్రౌండ్‌తో అడుగుపెట్టిన స్టార్ హీరోల నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా వాళ్ల టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో కొనసాగ లలుగుతారు. లేదంటే ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయ్యి ఫెల్యూర్ హీరోలుగా మిగిలిపోతారు. ఎలాగైనా తమదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా చూపగలిగితేనే ఇండస్ట్రీలో ఉంటారు. అలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలక్షణ నటుడుగాను మంచి పేరు సంపాదించుకున్నాడు. సినీ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రియల్ హిట్లు సాధించిన మోహన్ బాబు.. హీరోగా అవకాశాలు దక్కుతున్న క్రమంలో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను నటించి మెప్పించాడు.
తర్వాత.. మెల్లగా కొడుకులను నటవారుసలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు పలు సినిమాల్లో నటించినా తమ్మ సత్తా చాటుకోలేకపోయారు. కాగా మనోజ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు. అంతేకాదు మోహన్ బాబు టాలెంట్ మనోజ్ నటనలో కనిపిస్తుందంటూ మనోజ్ మంచి నటుడు అవుతాడు అంటూ ఎన్నో అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ సడన్గా ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయిపోయాడు. కారణాలు తెలియవు గాని.. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రారంభించడానికి సిద్ధమైన మనోజ్ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక్కడ వరకు బానే ఉన్నా.. ప్రస్తుతం పుష్ప 2తో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో చూస్తూనే ఉన్నాం. అన్ని కుదిరితే మనోజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ లో ఉండాల్సిన వాడు. కానీ.. కేవలం సరైన సినిమాలను ఎంచుకోకపోవడం ఆయనకు మైనస్ అయిందని.. అంతే కాదు.. మంచి కథలా ఎంపిక విషయంలో అన్న విష్ణు, మోహన్ బాబులు తనను అడ్డుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత తండ్రి.. కొడుకు విషయంలో అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడు అని ప్రశ్నించే వారు కూడా లేరట. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి మోహన్ బాబు.. మంచు విష్ణువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ మనోజ్ కి ఇవ్వలేదని అభిప్రాయాలు వెళ్ళిపోతున్నాయి. అదే మనోజ్ కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడానికి కారణమైందట. ఇక తాజాగా మంచు మోహన్ బాబు.. మనోజ్ మద్యన ఆస్తి తగాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనోజ్ కు సంబంధించిన ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది.