బన్నీ నువ్వు నా బంగారం రాజేంద్రప్రసాద్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ లో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హ‌రిక‌థ బెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్‌లో మాట్లాడుతూ.. చందనం దుంగల దొంగ.. వాడొక హీరో అంటూ చేసిన కామెంట్స్ ఇటీవల హాట్‌ టాపిక్‌గా తెగ ట్రెండ్ అయ్యాయి.

Rajendra Prasad Comments on Allu Arjun and Pushpa 2 The Rule Movie |  Filmyfocus.com

ఈ క్రమంలో బన్నీని ఉద్దేశించే రాజేంద్రప్రసాద్ అలాంటి కామెంట్స్ చేశారంటూ.. పుష్ప 2 సినిమాపై ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారంటూ వార్తలు తెగ వైరల్ గా అయ్యాయి. దీంతో నెట్టింట చర్చినీయంశంగా.. ఓ వివాదంగా మారింది. ఇంకా గొడవ ముదర‌క‌ముందే దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్.. తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ నేను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని వెల్లడించాడు. బన్నీ నా కొడుకు లాంటివాడు. అతన్ని అలా నేను ఎందుకు అంటాను.. బ‌న్నీ నువ్వు నా బంగారం.. లవ్ యు అంటూ రాజేంద్రప్రసాద్ వెళ్లడించాడు.

Rajendra Prasad - Movies, Biography, News, Age & Photos | BookMyShow

నేను పుష్ప సినిమాపై నెగటివ్ గా మాట్లాడలేదని.. అయితే ఇలాంటి నెగటివ్ వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక వివాదం కూడా లేదు కదా.. కొత్తది ఇది వచ్చింది అంటూ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. కానీ.. నేను చేసిన కామెంట్స్ మాత్రం అల్లు అర్జున్ ను ఉద్దేశించినవి కానే కాదని.. ఇది క్రియేట్ చేసింది ఎవరో కానీ వాడికి ఒకటే చెబుతున్నా.. బ‌న్నీ నా కొడుకు లాంటివాడు అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.