టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా సమంత మాజీ భర్త చైతన్య తాజాగా హీరోయిన్ శోభోభితను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలో సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ నెట్ హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా సామ్ తన ఇన్‌స్టా వేదికగా.. తన రాశికి చెందిన వారు.. 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను షేర్ చేసుకుంది. సమంత ఇందులో వృషభ , కన్య, మకర రాశి వారు 2025 లో మరింత సక్సెస్ సాధిస్తారని.. కొన్ని ముఖ్య విషయాల్లో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయంటూ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం బిజీగా ఉంటూ వృత్తిపరంగా మెరుగుదల సాధించడమే కాదు.. ముఖ్యంగా ప్రేమ, నమ్మకం.. ఇచ్చే భాగస్వామిని పొందుతారని.. మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటూ.. పిల్లలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
ఈ సందేశం ప్రస్తుతం నెటింట వైరల్ గా మారుతుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే సిటాడెల్‌తో ప్రేక్షకులు అలరించిన సమంత.. తన రాబోయే సిరీస్ రక్త బ్రహ్మాండ్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలకు మెరువనుంది. రాహి అనిల్ బార్వే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ సెట్ లో తాజాగా అడుగుపెట్టిన సమంత.. సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత ప్రస్తుతం పెళ్లి పిల్లల విషయంలో తన జాతకం పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఇందులో ఉన్న విధంగా మీకు అన్ని సంతోషాలు కలగాలంటూ సమంత ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.