అల్లు అర్జున్ పుష్ప దీ రూల్ ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా పాన్ ఇండియా లెవెల్ లో.. వరల్డ్ వైడ్ గాను మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు.. ఊహించని విజయంతో మేకర్స్ ఆనందంలో మునిగిపోయారు. రిలీజ్‌కి ముందు దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమోషన్స్ లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న బన్నీ.. ఇప్పుడు సక్సెస్ తర్వాత మరోసారి అభిమానులు కలవాలని భావిస్తున్నాడట. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రేర్ రికార్డు క్రియేట్ చేసింది. బన్నీ రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్స్ లో ఆయనకు మరింత ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత.. రోజుకు కలెక్షన్లలో మరింత జోరు చూపిస్తూ ఊచకోత కోస్తున్నాడు పుష్పరాజ్.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర రూ.1000కోట్ల వసూలు దాటేసింది. కేవలం అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే ఈ రికార్డు నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఈ సక్సెస్ కోసం తనకు సపోర్ట్ గా నిలిచిన ఫ్యాన్స్ కు, మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ మరోసారి సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. వచ్చేవారం దేశంలోనే ప్రధాన నగరాలను సందర్శించి గ్రాండ్ లెవెల్ లో ఈ సక్సెస్ టూర్ ను ప్లాన్ చేస్తున్నాడట బన్నీ.
ఈ టూర్‌లో ఫ్యాన్స్ తో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ముచ్చటించనున్నాడని ఫ్యాన్స్ అభిమానానికి, ప్రేమకు ధన్యవాదాలు చెప్పనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కేవలం సక్సెస్మీట్ కాదు.. బన్నీ నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తున్నారట. చివరిగా విజయ యాత్ర హైదరాబాద్‌లో ముగియనుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ తెలియడంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ సక్సెస్ మీట్ ఉంటుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇక బన్నీ తాజాగా సాధించిన రికార్డ్ ఆయనకు మాత్రమే గర్వకారణం కాదు. టాలీవుడ్ స్టాండర్డ్స్ మరో స్థాయికి తీసుకు వెళ్లడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఈ విజయంతో బన్నీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.