టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా మొదలుకొని ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్.. ఆర్ఆర్ఆర్ వరకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇక జక్కన్న సినిమాలకు మార్కెట్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసి.. తన సినిమాతో ఆ హీరోలకు ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసి పెట్టాడు రాజమౌళి.
ఇప్పటికీ అదే క్రేజ్‌తో వారు హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగులోనే కాదు.. యావత్ ప్రపంచమంతా ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్ రాజమౌళినే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏదేమైనా రాజమౌళి లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలనుకుంటాయి. ఇక అలాంటి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి.. తెలుగులోనే టాప్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలామంది ఆడియన్స్‌లో ఉంటుంది.
ఇక ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా చిరుతో సినిమా తీయాలని భావిస్తాడు. కారణం ఆయనతో సినిమా చేస్తే దర్శకుడిగా వారి ఇమేజ్ రెట్టింపు అవుతుందని నమ్మకం. కానీ.. రాజమౌళి మాత్రం ఒక్కసారి కూడా చిరంజీవితో సినిమా చేయడానికి కూడా ఆలోచన చేయలేదు. కారణం చిరంజీవిని ఆయన హ్యాండిల్ చేయలేనని ఆలోచన అయి ఉంటుందో.. లేదా అసలు చిరంజీవితో సినిమా తీయడం ఇంట్రెస్ట్ లేదా తెలియదు కానీ.. గతంలో రాజమౌళినే.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మొదట సీనియర్ ఎన్టీఆర్ అని, ఆ నెక్స్ట్ జనరేషన్ లో చిరంజీవి నెంబర్ వన్ హీరో అంటూ స్వయంగా వెల్లడించాడు. అలాంటి స్టార్ హీరో ఇప్పటికీ ఫామ్ లో ఉన్న.. రాజమౌళి సినిమా చేయకపోవడంతో చిరంజీవి ఫ్యాన్స్ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్‌తో రెండు సినిమాలను తెరకెక్కించి రెండు బ్లాక్ బస్టర్లు అందించిన రాజమౌళి.. మెగాస్టార్ తో కూడా ఓ సినిమా తీస్తే బాగుంటుందని ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.