మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నం. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఇండస్ట్రీ నుంచి అందుకున్న సక్సెస్‌ల రికార్డులు ఏంటో ఒకసారి రీ కాల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 2024 ఇండస్ట్రీలో అన్ని భాషల వారికి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు మరింత సక్సెస్ అందించింది. అలా 2024 గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ 10 సెర్చింగ్లో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో టాప్ టెన్ లో ఏకంగా తెలుగులో మూడు సినిమాలు ఉండడం విశేషం. వాటిలో రెండు సినిమాలు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి చెందినవి కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఫుల్ కిక్ ఇస్తుంది.
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సిజ్ ఫైర్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.700 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఈ ఏడాదిలో అంతకుమించి సక్సెస్ అందించిన మరో మూవీ కల్కి 2898 ఏడి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళను కొల్లగొట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. భారతీయ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన సినిమా ఇది. ఈ రెండు సినిమాలతో పాటు టాప్ 10 సెర్చింగ్ లో ఉన్న మూడవ తెలుగు సినిమా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్. ఈ సినిమాలో.. తేజ సజ్జ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమాకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులతో పాటు.. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక google టాప్ 10 సెర్చింగ్ జాబితాలో.. కల్కి 2898 ఏడి రెండవ స్థానంలో నిలువగా.. హనుమాన్ 5వ స్థానాన్ని, సలార్ 9వ స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే ఈ లిస్టులో మొదటి స్థానాన్ని శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్‌ల స్త్రీ 2 దక్కించుకుంది.12త్ ఫెయిల్ మూడో స్థానంలో, లపతా లేడీస్ నాలుగో స్థానంలో, మహారాజ్ ఆరవ స్థానంలో, మంజుమల్ బాయ్స్ ఏడో స్థానంలో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం 8వ స్థానంలో, ఆవేశం 10వ స్థానంలో ఉన్నాయి. ఇలా టాప్ టెన్ లో ఏకంగా మూడు సినిమాలు ఉండటం ప్రస్తుతం టాలీవుడ్కు ఆనందాన్ని కలిగిస్తుంది.