సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అహర్నిసలు శ్రమించాల్సి ఉంటుంది. అలా స్టార్ హీరో గానే కాదు మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటుడు మోహన్ బాబు కూడా ఒక్కరూ. ఒకప్పుడు ఓ నటుడిగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు.. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా దూసుకుపోయాడు. అయితే గత కొంతకాలంగా అయినా సినిమాలకు దూరంగా ఉంటూ.. కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసినా.. ఇద్దరు సినిమాలతో తమ సత్తా చాటుకోలేక ఫెయిల్యూర్ హీరోలుగా మిగిలిపోయారు. ఇలాంటి క్రమంలో మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదం నెటింట హాట్ టాపిక్‌గా మారింది.
మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబుల మధ్య గొడవ బజారుకెక్కిన ఎవరూ దానిని సాల్వ్ చేసేందుకు సాహసించలేని పరిస్థితి. ఇలాంటి క్రమంలో పోలీసుల రంగంలోకి దిగి వారి సమస్యకు పరిష్కారం చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో మోహన్ బాబు క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని జర్నలిస్టులో కొంతమంది నిన్న రాత్రి ఆయన ఇంటిలోనికి అడుగు పెట్టారు. కానీ.. అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న మోహన్ బాబు ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ పై దాడికి దిగాడు. దాంతో రంజిత్ అనే జర్నలిస్ట్‌కు బోన్ ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో మీడియా జర్నలిస్టులంతా ఈ విషయాన్ని తెలుసుకుని మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గొడవలు మధ్యలో మోహన్ బాబు పరిస్థితి ఏంటి.. తను ఎలా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన రిపోర్టర్స్ పై ఇలా దాడి చేయడం సరైన పద్ధతి కాదంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మోహన్ బాబు దాడి చేసిన రంజిత్ అనే వ్యక్తి ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాడని.. ఆయన ఎలాంటి ప్రశ్న అడగకముందే తనపై అలా ప్రెస్టేషన్ చూపి.. మైక్ విసిరి కొట్టడం అది మొహానికి తగలడంతో.. ఆయన అక్కడికక్కడే క్రింద పడిపోయాడు. దీంతో గాయాలయ్యాయి. అంతేకాదు దవడ పై భాగంలో ఉండే జైగోమాటిక్ మూడుచోట్ల వీరిగినట్లు తెలుస్తుంది. ఇక గతంలో మోహన్ బాబు ఎన్నోసార్లు తన పిల్లలను ఎంత క్రమశిక్షణలో పెట్టుకున్నానని.. గొప్పలు పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుటుంబంలో తనతో పాటు కొడుకులు ఆస్తుల కోసం తగాదాలు పడుతూ బజారుకెక్కే స్థాయికి దిగజారారు. అది మీ పెంపకం అంటూ మోహన్ బాబు పై జనాలతో పాటు జర్నలిస్టులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.