టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లోనూ తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తమకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. తమ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్న తారక్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వార్ 2 నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మరోసారి భారీ లెవెల్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడట తారక్. ఇక ఆయన అనుకున్నట్లే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా.. లేదా అనేది తెలియాలంటే సినిమా సెట్స్ పైకి వచ్చి రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం, ఇప్పటికే దానికోసం లోకేష్ కనగరాజ్ తనకు కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక మరో పక్కన లోకేష్ కనగరాజు ప్రభాస్తోను సినిమా చేయబోతున్నాడని వార్తలు వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ తో కూడా సినిమా అంటూ వార్తలు వినిపించడంతో ఎన్టీఆర్, ప్రభాస్లను కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు ఏమో అని అభిప్రాయాలు జనంలో మొదలయాయి. అయితే వీరిద్దరూ వేర్వేరుగా లోకేష్ కనగరాజ్‌తో సినిమాలు నటిస్తున్నారా.. లేదా ఇద్దరు కలిసి ఓ మల్టీస్టార్ చేస్తున్నారా.. అసలు లోకేష్ కనగరాజ్‌తో సినిమా ఉందా.. లేదా.. తెలియాలంటే వీరిలో ఎవరో ఒకరు సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఇప్పటికే స్టార్ హీరోలు మంచి డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకుని సినిమాల్లో నటించడంలో బిజీగా ఉన్నారు. వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. తాను నటించే ప్రతి సినిమా విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ రానున్న రోజుల్లో సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో ఏ రేంజ్ లో పాపులారి దక్కించుకుంటారు వేచి చూడాలి.