మనోజ్ భార్యకు అఖిలప్రియతో కూడా సమస్య ఉందా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్, మోహన్ బాబులు మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. చిన్న కొడుకు మంచు మనోజ్, కోడ‌లు మౌనికలపై కూడా దాడి చేశారంటూ కేస్ పెట్టిన‌ సంగతి తెలిసిందే. అయితే మంచు మనోజ్, భార్య మౌనికలకు.. మౌనిక అక్క నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో కూడా ఎప్పటినుంచో ఆస్తుల పంచాయతీ కొనసాగుతుందట. అఖిలప్రియ కుటుంబ ఆస్తులు ఇప్పటికీ వారు పంచుకోలేదని.. ఇక మౌనిక ఇప్పటికే చాలాసార్లు ఆస్తులు పంపిణీ విషయమే అఖిలప్రియను అడిగిందని సమాచారం. అఖిలప్రియ ఆస్తుల పంపిణీ పై నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తుందని టాక్ నడుస్తుంది.

Bhuma Sisters Not In Talking Terms?

దీంతో ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆస్తుల పంపిణీ వ్యవహారాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం మోహన్ బాబు, మనోజ్‌ల‌ ఆస్తి పంపిణీ వ్యవహారం బజారుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు కూడా కొడుకే కాదు, కోడలు మౌనిక వల్ల కూడా తనకు ముప్పు ఉందంటూ ఫిర్యాదులో వెల్లడించాడు. దీంతో భూమి మౌనిక వార్తలో వైరల్ గా మారుతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కుటుంబ ఆస్తుల పంపిణీ పై చర్చ జరుగుతుండగా.. మౌనిక తరచు ఆస్తుల పంపిణీ గురించి అడుగుతోందట. అక్కవైపు సరైన రిప్లై రావ‌డంలేద‌ని కుటుంబ స్నేహితుల నుంచి సమాచారం.

No Mohan Babu at Manoj's Wedding? - Telugu Rajyam

తిరుపతిలో జగద్‌, విఖ్యాత్ అనే థియేటర్లు కూడా వీరికి ఉన్నాయి. అవి కూడా అఖిల ప్రియ కుటుంబ ఆస్తులు కావడంతో.. వీటిని కూడా పంచుకోవాల్సి ఉందని.. భూమ కుటుంబాల ఆస్తుల పంపిణీ కూడా రానున్న రోజుల్లో వివాదానికి దారి తీయబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మౌనిక కోరుకున్నట్లు పంపిణీ జరిగే అవకాశం లేదని.. భూమా కుటుంబ ఆప్తులు వెల్లడిస్తున్నారు. ఆస్తులు పంపిణీకి అఖిలప్రియ ముందుకు వస్తే తప్ప.. ఎవరి మనసులో ఏముందో తెలిసే అవకాశం లేదని.. చర్చ ఆళ్లగడ్డలో కొనసాగుతోంది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో అలాగే పాలిటిక్స్లను హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.