సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు కూడా నిమిషాలకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నయనతార దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న, పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఓ పక్కన సినిమాలు, ఒక పక్కన బ్రాండ్ ప్రమోషన్స్, మరో పక్కన బిజినెస్ లు చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రమ్యునరేషన్ రూ.10 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక బ్రాండ్ ప్రమోషన్స్ కు అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని.. తాజాగా ఆమె ఒక 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్ల ఎమ్మినరేషన్ తీసుకోవడం హార్ట్ టాపిక్ గా మారింది.
ఇక సౌత్ సీనియర్ స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ కూడా నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ మంచి క్రేజ్‌తో కొనసాగుతుంది. ఈమె తన ఒక్క సినిమాకు రూ.8 నుంచి రూ.10 కోట్ల రమ్యునరేష్ తీసుకుంటుంది. ఇక యాడ్ ఫిలింకు కచ్చితంగా రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు రమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. ప్రస్తుతం త్రిష వరుస ఆఫర్లు అఏదుకుంటూ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.
పాన్ ఇండియా లెవెల్లో నేషనల్‌క్రష్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రష్మిక ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎలాంటి సక్సస్ సంపాదించుకుందో తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు.. సినిమాకు రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట. ఇక యాడ్‌ఖు దాదాపు రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంతకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉన్న బిజినెస్ పరంగాను, బ్రాండ్ ప్రమోషన్స్ లోనూ, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. ఇక సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేసిన సమంత.. ఒక బ్రాండ్ ప్రమోషన్ కు ఏకంగా రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందట.