ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. వాటిలో రూ.1000 కోట్ల క్లబ్లో కి చేరి రికార్డు సృష్టించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో ఏకంగా 7 సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
దంగల్:
అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై రూ.2000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
బాహుబలి 2:
ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా కనిపించిన సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్‌లో ఏకంగా రూ.1810కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి టాలీవుడ్ సత్తా చాటింది.
ఆర్ఆర్ఆర్:
రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1390 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
కేజిఎఫ్ 2:
కోలీవుడ్ నటుడు యష్ హీరోగా నటించిన ఈ సినిమా కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.1250 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
కల్కి 2898 AD:
ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి రూ.1200 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
జవాన్:
షారుక్ ఖాన్ హీరోగా.. అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ జవాన్. రూ.1148 కోట్ల వసూళ్లను రాబట్టింది.
పఠాన్:
షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ పఠాన్. ఈ సినిమా ఏకంగా రూ.1050 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఇక త్వరలోనే పుష్ప 2 కూడా ఈ క్లబ్ లోకి చేరడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా 800 కోట్ల కలెక్షన్లను దాటేసి వెయ్యికోట్ల రన్ వైపు పరుగులు తీస్తుంది. పుష్ప 2కి అంత స్టామినా ఉందా.. పుష్ప రాజ్ వెయ్యి కోట్లు కొలగొడతాడా లేదా తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.