టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన సినీ కెరీర్‌లో పుష్పకి ముందు.. పుష్ప తర్వాత అనే రేంజ్‌కు పెంచుకున్నాడు. పుష్ప సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న సుక్కు.. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు.. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశక్తి చూపించే రేంజ్ కు ఎదిగాడు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ రేంజ్ లో సినిమాను తీయగల డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న సుక్కు.. తాను సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ పక్క అనేంతలా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా మార్కెట్ క్రేజ్ విపరీతంగా ఉంటాయని హీరోలకు కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది.
దీంతో సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండిపోతుందని అంశం నెటింట హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజులుగా సుక్కు నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నా.. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ టీం లో రైటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై కామెంట్స్ చేశాడు. ఇప్పటికే.. రామ్ చరణ్‌తో సిట్టింగ్ అయిందని.. ఇద్దరు ఓ మాట అనేసుకున్నారని చెప్పుకొచ్చాడు. పుష్ప 2తో సుకుమార్ చాలా అలసిపోయారని.. కనుక చిన్న వెకేషన్ బ్రేక్ తీసుకుంటున్నారని అతను వెల్లడించాడు. ఆ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత చరణ్ తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందంటూ వెల్లడించాడు.
దీంతో.. ఆయన కామెంట్స్ ని బట్టి చూస్తే సుకుమార్ నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తోనే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం తెరకెక్కి ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసింది. ఈ సినిమాతో చరణ్ నట వీశ్వరూపం చూపించాడు. ఆయన నటనకు ఎంతో మంది ఆడియన్స్ ఫిదా అయ్యారు. కనుక.. మరోసారి వీరిద్దరికి కాంబో రిపీట్ అయితే ఈ సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్ లో హైప్ వేరే లెవెల్ లో ఉంటుందన్నంలో సందేహం లేదు. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చరణ్ సినిమా స్టార్ట్ కానుంది.