టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే.. సినిమాపై ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తున్నా.. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే.. విజయేంద్రప్రసాద్ గతంలో అందించిన లీకేజ్ ప్రకారం.. ఈ సినిమా జనవరిలో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ క్రమంలోని రాజమౌళి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారు అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇక జక్కన్న.. మహేష్ బాబుతో సినిమాను గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కించనునట్లు వెల్లడించాడు.
భారీ స్కేల్‌తో సినిమా రూపొందనుందని.. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా కోసం పని చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వినిపిస్తోంది. ఈ మూవీ విషయంలో రాజమౌళి బాహుబలి పంథానే ఫాలో అవుతున్నాడని.. మహేష్ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందించినట్లు సమాచారం. వెయ్యి కోట్లతో సినిమాను నిర్మించాలని అనుకున్న బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని.. దీంతో సినిమా రూ.1200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని.. అందుకే సినిమాను రెండు పార్ట్‌లుగా తీయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట.
అంతేకాదు.. ఈ మూవీ కంప్లీట్ కావడానికి దాదాపు 6 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే.. ఈ ఆరేళ్లలో ఎంత కాదనుకున్న మార్పులు, చేర్పులతో మరో ఏడాది పెరిగినా.. తగ్గిన ఆశ్చర్యపోవాలి. ఈ క్రమంలో.. అంకాలం సినిమా కోసం వెయిట్ చేయడం కష్టమంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి పై కొందరు ట్రోల్స్ కూడా మొదలుపెట్టేశారు. ఈ లోపు మాకు పెళ్లిళకళై పిల్లలు కూడా కొడతారంటూ.. మా పిల్లల పెద్దోళ్ళు కూడా అయిపోతారు అంటూ మరికొందరు.. అప్పటికి మహేష్ తాతల అయిపోతారేమో అని ఇంకొందరు కామెంట్లు చేస్తూ రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు. నిజంగా దీన్ని రెండు పార్ట్‌లుగా తీస్తారా.. ఈ సినిమాకు ఎంత సమయం పడుతుంది.. ఎప్పుడు సినిమాను స్టార్ట్ చేయనున్నారో.. తెలియాలంటే జక్కన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.