ఇండస్ట్రీలో చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఎంతో మంది సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. ఫలానా హీరో లేదా హీరోయిన్ సినిమాలో నటిస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమంటూ.. సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే.. సినిమాకు ఎలాంటి టైటిల్ పడితే సినిమా సక్సెస్ అవుతుందో అని.. అదే తేదిన సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ కాయమని ఇలా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మాత్రం ఓ నటుడు ఏ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ హిట్ సెంటిమెంట్ అంతలా వైరల్ కావడానికి కారణమైన ఆ నటుడు ఎవరు.. ఆయన నటించిన సినిమాలంటే ఒకసారి చూద్దాం.
అతనే తారక్ పొనప్ప. పేరు చెప్తే తెలియకపోవచ్చు. కానీ.. చూస్తే వెంటనే గుర్తుపడతారు. స్వతహాగా కన్నడ యాక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక్ పొన్నప్ప.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీబిజీగా కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఇక.. ఎక్కువగా విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్‌లుగా నిలవడంతో.. మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. పలు రియాలిటీ షోలు చేసుకుంటూ.. కన్నడ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారక్ పొనప్ప.. కేజిఎఫ్ సినిమాలో ఓ విలన్ గా కనిపించాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలుగు డైరెక్టర్స్ ఈయనకు ఆఫర్స్ ఇచ్చారు. అలా కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా తారక్ పొనప్ప నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాదు.. తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్ప 2లోను బుగ్గారెడ్డి అనే విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప నటించి ఆకట్టుకున్నాడు. కేవలం లోకల్ సినిమాలే కాదు.. ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన తారక్ పొన్నప్ప.. ఈ నాలుగు సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇలా తాను ఏ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సినిమా సక్సెస్ కాయమంటూ ఓ లక్కీ సెంటిమెంట్.. ఆయన సినిమాలకు లక్కీ చార్మ్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.