టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత కలెక్షన్‌ల పరంగా దూసుకెళ్ళుతుంది. కానీ ఇప్పటికీ మేకర్స్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ఎంతమంది మండిపడ్డారు. కేవలం సినిమాకు ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే అంత క్రౌడ్ పోగైందని.. ఆమె చనిపోయిందంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై మేకర్స్ రియాక్ట్ అవుతూ.. మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ సైతం రూ.25 లక్షలు సహాయం అందిస్తామని చెప్పుకొచ్చాడు. దీని సంగతి అట్ట ఉంచితే.. ఈ సినిమా రిలీజ్ తర్వాత రోజునే ఆన్లైన్ సైట్స్ లో ఫుల్ మూవీ ప్రత్యక్షమవడం మేకర్స్‌కు బిగ్ షాక్ కలిగించింది.
ఆ షాక్ నుంచి కోరుకునే లోపు యూట్యూబ్లో ఫుల్ మూవీ హిందీ వర్షన్ స్కీమింగ్ అయింది. ఇక తాజాగా మరోసారి ఆ పదము సినిమా నుంచి తొలగించకపోతే ఇంటికి వచ్చి మరి కొడతామంటూ పుష్ప 2 ప్రొడ్యూసర్లకు కొంతమంది డైరెక్టు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ పదం ఏంటి.. అసలు ఇంత వివాదానికి కారణమైన సీన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పుష్ప 2 లో బన్నీకి స్ట్రాంగ్ విలన్ గా ఫాహద్ ఫజిల్ భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో పదే పదే దమ్ముంటే కాస్కోరా షేకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అనే పదం వాడుతూ ఉండడంతో.. షేకావత్ అనే పదాన్ని పదేపదే అలాంటి సన్నివేశాల్లో ఉపయోగించి క్షత్రియ సమాజాన్ని అవమానిస్తున్నారు అంటూ కర్ణ సేన సంఘం రాజ్ షేకావత్ ఈ సినిమాపై మండిపడ్డాడు.
అంతేకాదు.. పుష్ప 2 సినిమా నుంచి షేకావత్ అనే పదాన్ని తొలగించకపోతే.. నిర్మాతలకు భారీ షాక్ తప్పదని ఇంటికి వెళ్లి మరి ప్రొడ్యూసర్లను కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. వాక్ స్వాతంత్రం ఉండటం వల్ల సినిమాల్లో ఇలాంటి ఇతరులను కించపరిచే పదాలను వాడుకోవడం అస్సలు మంచిది కాదని.. షేకావత అనే పదాన్ని సినిమా నుంచి తొలగించకపోతే అసలు సహించమంటే చెప్పుకొచ్చారు. అలా ప్రతిసారి సినిమాలో షేకావత్ పదాన్ని ఉపయోగించడం క్షత్రియ కమ్యూనిటీని దారుణంగా అవమానించినట్లు ఉందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు.. సినిమా నుంచి ఆ పదాన్ని తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి రాజ్ షేకావత్ చేసిన కామెంట్లు పై పుష్ప 2 ప్రొడ్యూసర్లు ఎలా రియాక్ట్ అవుతారో.. తమ సినిమా నుంచి షేకావత్ అనే పదాన్ని తొలగించడానికి ఒప్పుకుంటారో.. లేదో.. వేచి చూడాలి.
पुष्पा 2 फ़िल्म मे “शेखावत” का नेगेटिव किरदार, फिर से क्षत्रियों का अपमान, तैयार रहे करणी सैनिक, जल्द फ़िल्म निर्माता की ठुकाई की जाएगी। @aajtak @ABPNews @ZeeNews @VtvGujarati @BBCBreaking @CNNnews18 @timesofindia @TimesNow @htTweets @EconomicTimes @FinancialTimes @JagranNews… pic.twitter.com/vsbm2r3OLL
— Dr. Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) December 8, 2024