టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప 2 ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం బన్నీ ఫాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా అల్లు అర్జున్ మేనరిజానికి ఫిదా అయ్యారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఇలాంటి సక్సెస్ తో పుష్ప 2 దూసుకుపోతున్న క్రమంలో ఇప్పటికే ఓ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసులాటలో రేవతి(39) అనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో పుష్ప 2 మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. వారికి అండగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గంలోని థియేటర్‌లో పుష్ప 2 సినిమా చూస్తూ మదనప్ప (37) అనే అభిమాని మృతి చెందాడు. షో ముగిసిన తర్వాత అతను సీట్లో నుంచి కదలకపోవడంతో.. ప్రేక్షకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఆ వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు.
వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే మదనప్ప తొక్కిసులాట్లో మరణించి ఉంటాడని అనుమానంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఇక దీనిపై రియాక్ట్ అయిన పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి బంధువులు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో.. కేవలం ఆ సినిమాలో జరిగే ఫైట్ సీన్స్, ఎలివేషన్స్ లో వచ్చే భారీ మ్యూజిక్ కారణంగానే హార్ట్ ఎటాక్ వచ్చి అతను మరణించి ఉంటాడని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.