టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దాక్షాయినిగా ఈ సినిమాల తన నటనతో ఆకట్టుకుంది. పుష్ప 1లో కూడా అనసూయ నటించిన సంగతి తెలిసిందే. ఇక.. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ యాంకర్ గా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అతి తక్కవ టైం లోనే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే ఎన్నో ట్విస్ట్‌లు, ఆసక్తికర ఘటనలు ఉంటాయి.
ఆమె ఏడు ఏళ్ళు పోరాడి మరీ తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్సిసి క్యాడేట్ అయిన అనసూయ.. ఒక క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ ని కలిసిందట. అప్పటికి వారు స్కూల్ స్టూడెంట్స్. స్కూల్ డేస్ లోనే మొదలైన వీరి బంధం.. పెళ్లితో మరింత దృఢపడింది. మొదట సుశాంత్ తో పెళ్లికి అనసూయ తండ్రి ఒప్పుకోలేదట. ఇంటి నుంచి బయటకు వచ్చేసినా అనసూయ.. చాలాకాలం హాస్టల్లో ఉంది. తండ్రికి తెలియకుండా లేచిపోయి వివాహం చేసుకుందామని సుశాంత్ తో చెప్పిందట. ఆయన మాత్రం పెద్దల అనుమతితో పెళ్లి జరగాలని.. జరుగుతుందని నమ్మకంతో ఉన్నాడట. ఇక అతని నమ్మకం నిజం కావాలని తన పేరెంట్స్ వారి పెళ్లికి ఒప్పుకోవాలని దాదాపు ఏడేళ్ల పాటు దేవుడికి మొక్కుకొని తనకు నచ్చిన చాక్లెట్స్, బంగాళదుంపలను వదిలేసిందట.
ఎట్టకేలకు అనసూయ పెళ్లికి అనసూయ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇద్దరు వివాహం చేసుకొని పండంటి పిల్లలకు జన్మనిచ్చారు. అనసూయ తండ్రికి ముగ్గురు ఆడపిల్లలే.. కావడంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని ఆమె గట్టిగా కోరుకుందట. అయితే రెండోసారి అమ్మాయి కావాలనుకున్న మళ్లీ అబ్బాయి పుట్టడంతో ఆమె కాస్త డిసప్పాయింట్ అయిందని.. కూతురు కోసం మరోసారి తల్లి కావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఈ విషయాని స్వయంగా అనసూయ వెల్లడించింది. నాలుగు పదుల వయసులో ఇప్పటికి తాను అమ్మాయిని కనేందుకు రెడీ అంటూ అనసూయ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక అనసూయ బుల్లితెరపై అడపాదడపా షోలలో మెరుస్తూ సినిమాల్లో నటిగా రానిస్తుంది.