తెలుగు స్టార్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా జానీ మాస్టర్ కు ఇటీవల పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన ఎన్నో సవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ.. ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేపించింది. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు అంటూ ఆమె ఆరోపణలు చేసి సెక్షన్లతో పాటు.. ఆయనపై ఫోక్స్ కేసు కూడా నమోదు చేపించింది.
ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్.. గోవాలో పోలీసులకు చిక్కాడు. కొన్ని రోజులు జైల్లో ఉన్న మొత్తానికి బెయిల్ పై బయటకు వచ్చిన జాని మాస్టర్ను డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు. డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ఆయనను అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలగించినట్లు వెల్లడించారు. జానీ మాస్టర్ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లడంతో.. అతనిని ఆ పోస్టు నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోని స్థానికంగా జరిగిన ఎన్నికల్లో జోసఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా సెలెక్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే బెయిల్‌తో బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి ఎవరు అండగా నిలబడలేదు. స్టార్ హీరోలు కూడా జానీ మాస్టర్ వైపు కనీసం కన్నెతి చూడండి పరిస్థితి. మెగా హీరోలు జానీ మాస్టర్ కు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో ఓ స్టార్ హీరో జానీ మాస్టర్ కు పిలిచి మరి అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ స్టార్ హీరో తెలుగు వ్యక్తి కాదు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్. తన కొత్త సినిమాలో జానీ మాస్టర్ కు అవకాశం ఇచ్చారట. తను నటిస్తున్న బేబీ జాన్ సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సినిమాలో ఇప్పటికే జానీ మాస్టారు సాంగ్ ఓ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఆయన టాలెంట్ నచ్చిన వరుణ్.. జానీ మాస్టర్ కు సెకండ్ సాంగ్ అవకాశాన్ని ఇచ్చినట్లు సమాచారం.