టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఆడుగుపెట్టి ఎంతోమంది మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మెగా కుటుంబం నుంచి నటవరసరాలుగా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగబాబు కూతురు.. నిహారిక మాత్రం ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. నాగ శౌర్యతో కలిసి ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాతో కమర్షియల్ గా డిజాస్టర్ చేసింది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా కనిపించినా.. ఏ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ప్రొడ్యూసర్ గా మారి పలు వెబ్ సిరీస్లను తెరకెక్కించింది. అవి కూడా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు.
ఈ క్రమంలోనే చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక.. తర్వాత మనస్పర్ధలతో అతనికి విడాకులు ఇచ్చేసింది. విడాకుల తర్వాత మరోసారి కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ప్రొడ్యూసర్ గా మారి మంచి సక్సెస్ అందుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమా సక్సెస్ తో అమ్మడు మరిన్ని మంచి కంటెంట్‌లు తీసుకొని వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ.. తాజాగా ఆమె రిలీజ్ చేసిన వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. కాదల్ సడుగుడు అనే పాత బ్లాక్ బాస్టర్ క్లాసిక్ సాంగ్ ని రీమిక్స్ చేస్తూ అమ్మే హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసుకుంది. నిహారికతో పాటు ఈ హాట్ వీడియో సాంగ్ లో షానే నిగం కనిపించాడు. ఇందులో నిహారిక పర్ఫామెన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ మెగా ఫాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. నీ నుంచి ఇలాంటి కంటెంట్ వస్తుందని అసలు ఊహించలేదని.. నిర్మాతగా సినిమాలు తీసుకుంటుంది అనుకుంటే ఇలాంటి హాట్ పెర్ఫార్మన్స్‌లు ఇస్తూ మెగా పరువు పోగొడుతుంది అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో ఇలాంటి పనులు ఇప్పటివరకు ఎవరు చేయలేదని.. దయచేసి ఫ్యామిలీ పరువు తీయకు తల్లి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పర్ఫామెన్స్ లు చేసే ముందు మీ నాన్నకి రాజకీయ నేపథ్యం ఉంది. మీ బాబాయి ఓ రాష్ట్రానికి ఉపమాఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకో అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నిహారిక ఫ్యాన్స్ మాత్రం వృత్తిని వృత్తి లాగే చూడాలని.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ చేసి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. నిహారిక చేస్తే అందులో తప్పేముంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు కుర్రాళలో సెగలు రేపిన నిహారిక ఏకంగా ఎనిమిది లక్షల వ్యూస్ సాధించి నెటింట ట్రెండ్ అవుతుంది.