గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మెగా బ్రాండ్ ను వదిలి.. అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ వివాదాలను పెంచుకుంటూ పోతున్నాడు ఐకాన్ స్టార్. అలా.. గతంలో ఏపీ ఎన్నికల టైం లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లి.. అక్కడ ఆయన చేసిన కామెంట్స్ నెటింట పెద్ద దుమారమే రేపాయి. పూర్తిగా మెగా బ్రాండ్ కు దూరం చేసేసాయి. ఓవైపు తన చిన్న అన్న పవన్ పోటీలో ఉండగానే.. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా నిలవడంపై ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్న బన్నీ.. అప్పటినుంచి మెగా వేరు.. అల్లు వేరు.. అనేలా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇది ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచే జరుగుతుంది. గతంలోనే ఒక మూవీ ఫంక్షన్ లో బన్నీని మెగా ఫ్యాన్స్.. పవన్ గురించి మాట్లాడమనగా చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసాడు.
అప్పటినుంచో బన్నీలో చేంజ్ మొదలైంది. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న బన్నీ.. మెగా బ్రాండ్ ని, మెగా అభిమానులను హర్ట్ చేసేలా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో నెగటివ్ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జోరుగా కొనసాగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలో బాస్ పేరుతో ఉన్న డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించే బన్నీ కౌంటర్ వేసాడంటూ.. అల్లు, వైసిపి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కోపం తారస్థాయికి చేరుకుంది. అంతలా మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన బన్నీ.. మరి ఇటీవల సినిమా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం చూసి కరిగిపోయాడో.. వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ.. ఫైనల్లీ పవన్ పేరు చెబుతూ సక్సెస్ మీట్ లో ధన్యవాదాలు తెలిపాడు.
తాజాగా హైదరాబాదులో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ సక్సెస్‌మీట్‌లో బన్నీ మాట్లాడుతూ.. ఏపీ టికెట్ ధరల పెంపులో జీవో రావడానికి ప్రధాన కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థాంక్యూ. నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్ కి థాంక్యూ.. హార్ట్ ని టచ్ చేసారు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన వీడియో వైరల్ గా మారడంతో.. చెప్పను బ్రదర్ టు థాంక్యూ బాబాయ్ స్టేజ్ కు బన్నీ మారిపోయాడని.. అంతలా మార్పుకు కారణం ఏమై ఉంటుంది అంటూ.. మీరు పూర్తిగా మారిపోయారు సార్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.