పుష్ప 2లో ఐటెం క్వీన్‌గా శ్రీలీల మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో నటింపజేయాలని డైరెక్టర్ సుకుమార్ భావించాడట. అల్లు అర్జున్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకే.. పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత సాహో మూవీ హీరోయిన్గా నటించిన శ్రద్ధ కపూర్ అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉంది కాబట్టి.. సాంగ్ పై మంచి హైప్ ఏర్పడుతుందని భావించారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది ఎదురవడంతో.. ఆమె తప్పుకుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట శ్రద్ధా కపూర్.
దాంతో.. నిర్మాతలు మావల్ల కాదంటూ చేతులెత్తేసారని.. సుకుమార్‌కు సైతం.. అంత రెమ్యూనరేషన్ ఇచ్చి శ్రద్ధాతో సాంగ్ చేయించడం ఇష్టం లేదని సమాచారం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చెప్పడంతో శ్రీ లీలను సెలెక్ట్ చేశారని టాక్ నడుస్తుంది. సాధారణంగా.. శ్రీలీల ఐటమ్ సాంగ్స్ చేసేందుకు అస్సలు ఒప్పుకోరు. ఇటీవల.. ఒక్క స్టార్ హీరో సినిమాల్లో ఐటం సాంగ్‌కి నో చెప్పింది. అంతేకాదు.. స్టార్ హీరో చిరంజీవి.. విశ్వంభరలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా శ్రీ లీల నో చెప్పేసిందట. ఈ క్రమంలోనే పుష్ప 2కి ఆమె ఒప్పుకుంటుందా.. లేదా.. అనే అనుమానాలు ఉన్నా.. వారం రోజుల్లో డేట్స్ ఇవ్వాలని అప్పుడే భారీ రమ్యునరేషన్ ఇస్తామంటూ మైత్రి వాళ్ళు శ్రీలీలతో ఆఫర్ కుదుర్చుకున్నారట.
ఇక.. శ్రీలీలకు.. అల్లు అర్జున్ తో డాన్స్ చేయాలని కోరిక ఎప్పటి నుంచో ఉందని.. అంతేకాదు ఈ సాంగ్ కేవలం ఐటెం సాంగ్ ఏ కాదు.. ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతోనే శ్రీ లీల దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయాలని ఆమెను అడిగిన వెంటనే ఆలోచించకుండా.. బన్నీ కోసం ఆయనతో డ్యాన్స్ చేయడం కోసం ఓకే చెప్పేసిందని తెలుస్తుంది. ఇక శ్రీలీల.. ఇటీవల తన మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇకపై ఐటెం సాంగ్ చేసేదే లేదని.. అల్లు అర్జున్ కోసం కిసిక్ సాంగ్ మాత్రం చేశాను తప్ప.. ప్రత్యేకంగా తాను ఐటెం సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇకపై ఐటమ్ సాంగ్స్ చేసే ఉద్దేశం కూడా లేదని.. కచ్చితంగా ఐటమ్ సాంగ్ కి నో చెబుతానని కామెంట్స్ చేసింది. ఇక శ్రీలీల ఈ సాంగ్ లో నటించింది కేవలం ఐదు నుంచి పది నిమిషాలే అయినా.. సాంగ్ లో తన పర్ఫామెన్స్ తో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ఈ క్రమంలో శ్రీ లీల చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.