టాలీవుడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి అంటే టక్కున్న సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. శకుంతలం సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఖుషి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మైసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లోకి వస్తున్నట్టు ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతేకాదు ఇప్పటివరకు ఆమె ఏ సినిమాలోను నటించలేదు. ఇక గౌతమ్ మీనన డైరెక్షన్లో ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఇప్పటివరకు అది సెట్స్ పైకి రాలేదు.
అసలు.. ఆ సినిమాలో నటిస్తుందో, లేదో అనేదానిపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు సొంత బ్యానర్ పై ఓ సినిమాను ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చి కూడా చాన్నాళ్లయింది. అయినా ఇప్పటివరకు దానిపై మరో అప్డేట్ లేదు. కనీసం పుష్ప 2 ఐటెం సాంగ్ లో అయినా ఆమె మెరుస్తుందనుకుంటే అది కూడా లేదు. అలా సినిమాలకు మెల్లమెల్లగా దూరమైపోతున్న సమంత.. ఈ గ్యాప్ లో ఓటిటిలో మాత్రం అప్పుడప్పుడు మెరుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె సిటాడెల్.. హనీ బనీ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఏ సినిమాకు కూడా చేయని రేంజ్ లో ఈ సిరీస్ కోసం సమంత ప్రచారాలు చేసింది. ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది.
మొత్తానికి సిటాడేల్ హైఫ్ చల్లారింది. ఇప్పటికైనా సరికొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తుందని.. మూవీ సెట్స్ పైకి వస్తుందని.. అభిమానులంతా ఎదురు చూశారు. కానీ.. మరోసారి ఆమె ఓటిటి సిరీస్‌కే డేట్స్ ఇచ్చింది. ఈరోజు నుంచి సరికొత్త సిరీస్ లో ఆమె సందడి చేయనుంది. ఈ క్రమంలోనే సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిందని.. దానికి హింట్ ఇస్తూనే లవ్ సీన్లు చేయడం కంటే యాక్షన్ సీక్వెన్స్ చేయడమే తనకు ఇష్టమంటూ తన ఇన్‌స్టా లో వెల్లడించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే జనం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఓటిటి సిరీస్ లలోనే నటిస్తే మరి సినిమాల సంగతేంటి అంటూ.. ఇకపై సినిమాల్లో శ్యామ్ నటించదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.