టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌గా తెరకెక్కిన పుష్ప 2 ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ గర్ల్‌గా మెరిసింది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యార్నేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 వసూళ్ళు చూస్తుంటే.. సినిమాలో ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారు అర్థమవుతుంది.
మూవీ టీం తరఫున, తెలుగు వారందరి తరపున, ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మంత్రి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి.. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి అందరికీ ధన్యవాదాలు. దేశంలో మా సినిమాకు చోటు ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో బన్నీ సుకుమార్ గురించి మాట్లాడుతూ.. ఇక ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించిందంటే దానికి కారణం సుకుమార్ అని.. సుకుమార్ కు చాలా థాంక్స్, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు.
నేను పుష్ప 2 చేయడానికి ప్రధాన కారణం.. తెలుగు వారందరూ గర్వించదగ్గ సినిమాగా ఇది మారుతుందని నమ్మకం. అయితే అనుకోకుండా హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతి గారు మృతి చెందారు. ఆ సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 ఏళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్న. ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ.. డిసెంబర్ 4న వేసిన ప్రీమియర్ షో కి ఎక్కువ జనం రావడంతో ఇబ్బంది నెలకొంది. విషయాన్ని థియేటర్ యాజమాన్యం నాకు చెప్పిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చిన తర్వాత రేవతి గారి సంఘటన గురించి తెలిసి చాలా బాధనిపించింది. ఆ కుటుంబం కోసం రూ.25 లక్షల కేవలం ఒక సహాయంగా మాత్రమే అందిస్తున్న. ఒక మనిషి లేని లోటు నేను ఎప్పటికీ తీర్చలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని.. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి కుటుంబాన్ని కలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.