సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి ఓ సినిమా తెరకెక్కుతుందంటే.. ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఆశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా ఇప్పటివరకు తెరకెక్కిన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 10 సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
పుష్ప 2 ది రూల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో తరికెక్కిన తాజా మూవీ పుష్ప 2 ది రూల్. భారతీయ సినీ ఇండస్ట్రీలో.. ఏ సినిమా సాధించలేని విధంగా.. మొట్టమొదటి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసి నెంబర్ వన్ పొజీషన్‌లో నిలిచింది.
ఆర్ఆర్ఆర్
రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ఏకంగా రూ.223.5 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. టాప్ టెన్ హైయెస్ట్ సినిమాల్లో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.
బాహుబలి 2
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి 2 లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రూ.214 కోట్లు కొల్లగొట్టి అప్పట్లో రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాహుబలి 2 హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టెన్ 10లో.. మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
కల్కి 2898 ఏడి
ప్రభాస్ హీరోగా, నాగశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజై.. ఫస్ట్ డే నే ఏకంగా రూ.182.6 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది.
సలార్
ప్రభాస్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించిన మూవీ సలార్. శృతిహాసన్ హీరోయిన్గా కనిపించింది. ఇక ఈ సినిమా మొదటి రోజు రూ.165 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి ఐదో స్థానంలో నిలిచింది.
కేజిఎఫ్ చాప్టర్ 2
కోలీవుడ్ స్టార్ హీరో యష్ నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు రూ.162.9 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. కలెక్షన్ల పరంగా ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.
లియో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి రోజు రూ.142.8 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఏడవ స్థానాన్ని సొంతం చేసుకుంది.
దేవర పార్ట్ 1:
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే రూ.145.2 కోట్ల కలెక్షన్లను సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా సెకండ్ పార్ట్ తెరకెక్కనుంది.
ఆదిపురుష్:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కృతి సనన్ హీరోయిన్గా నటించిన సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. మొదట నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ తో ఉన్న క్రేజ్ రీత్యా విపరీతమైన కలెక్షన్లు కల్లగొట్టింది. అలా మొట్టమొదటి రోజే ఏకంగా రూ.136.8 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుని తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
జవాన్
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా , నయనతార హీరోయిన్గా నటించిన మూవీ జవాన్. అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు రూ.129.2 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. అలా.. జవాన్ భారీ కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాల్లో టాప్ టెన్ గా నిలిచింది.