క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన నాలుగో మూవీ పుష్ప 2. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా పని ఇండియా ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే కలెక్షన్లతో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. పుష్పరాజ్ మేనరిజంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.
ఈ క్మంలోనే మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత వేగంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు.. హిందీలో తొలి రెండు రోజుల్లో ఏకంగా రూ.131 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇక రిలీజ్ అయిన మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్లు కలెక్షన్లు సాధించిన ఈ మూవీ.. మూడో రోజున దేశవ్యాప్తంగా రూ.120 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. మూడో రోజు సౌత్‌లో రూ.45 కోట్లు, నార్త్‌లో రూ.75 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని సమాచారం.
ఇలా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత వేగంగా రూ.500 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది, అంతేకాదు ముందు ముందు స్టార్ హీరోల నుంచి రాబోతున్న సినిమాలన్నీటికి పుష్ప 2 కలెక్షన్స్ సాలిడ్ మార్జిన్ ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా హీరో రికార్డును ఇప్పట్లో టచ్ చేయడం ఎవరివల్ల కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకుంటాయని మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో పుష్పరాజ్ నాలుగవ రోజు ఏ రేంజ్ లో కలెక్షన్లు కొలగొడతాడో వేచి చూడాలి.