తారక్ తిండిపై మహేష్ సెటైర్లు… అంత మాట అన్నాడేంటి..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంతా ఒకరినొకరు ఎంతగానో గౌరవించుకుంటూ ఉంటారు. తమతోటి నటుల‌ను సొంత వారిలా ఫీలవుతూ ఉంటారు. అలాంటి వారిలో మహేష్ బాబు, ఎన్టీఆర్ కూడా ఉంటారు. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్యన ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్‌ను.. తారక్ అని అంటూ పిలుస్తూ ఉంటాడు. అంతే కాదు మహేష్ కూడా.. తారక్‌ను తన సొంత తమ్ముడిలా ఫీలవుతారు. ఓ సెలబ్రిటీకి సంబంధించిన షో ఏదన్న.. మరో సెలబ్రిటీ వెళ్తూ ఉండడం సహజంగానే జరుగుతుంది. అలా.. గతంలో తారక్ పిలవగానే మహేష్ ఆ షోకు వెళ్ళాడు. అదే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఇక గతంలో ఈ షోలో మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకరి గురించి ఒకరు ఇంట్రెస్టింగ్ విషయాలను సరదాగా షేర్ చేసుకున్నారు.

ఇక ఒకరికి ఒకరి ఫుడ్ అలవాట్ల గురించి బాగా తెలుసు. ఈ క్రమంలోనే మహేష్ బాబు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి ఆయన తిండి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తారక్ మంచి ఫుడీ అని.. ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు తిండి ఎలా తినేవాడో ఒకసారి మాట్లాడుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో ఎన్టీఆర్ కలుగజేసుకుని.. ఇప్పుడు ఎందుకు అన్నా అవన్నీ అంటుండగానే.. ఇప్పుడంటే ఇలా ఉన్నావు కానీ.. నువ్వు అప్పుడు ఎలా తినేవాడివో నాకు తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు. వెంటనే తారక్.. వద్దు అన్నా నేను ఎలా తినేవాడిన మాత్రం చెప్పకు అంటూ కామెంట్స్ చేశాడు.

Evaru Meelo Koteeswarulu 2021: Ntr Episode with Mahesh Babu | Evaru Meelo  Koteeswarulu 2021: మహేష్ ను ఆడేసుకున్న ఎన్టీఆర్.. ప్రోమో వచ్చేసింది..

వెంటనే మహేష్ చెబుతూ.. ఇడ్లీని ఎలా తినేవాడివో గుర్తుందా.. అలా నెయ్యిలో ముంచేసుకొని తీసి.. చట్నీలో తినేవాడివి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. వెంటనే తారక్ రియాక్ట్ అవుతూ.. అలా వారం రోజులు మీకు కూడా తినిపించాలన్నా.. అప్పుడెలా ఉంటావో చూడు.. బుగ్గలు గుండ్రంగా తయారై భలే ఉంటావు అంటూ కౌంటర్ వేశాడు. ఈ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం తారక్‌, మహేష్ బిజీ లైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో బిజీ లైన‌ప్ ఏర్పాటు చేసుకుంటే.. మహేష్, రాజమౌళితో పాన్ వ‌ర‌ల్ఢ్‌ సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఫ్యూచర్లో మరిన్ని సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్లు తమ ఖాతాలో వేసుకోవాలంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.