నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్కన రాజకీయాల్లోనూ, సినిమాల్లోనే కాదు.. మరోపక్క అన్‌స్టాపబుల్ టాక్ షో హోస్ట్ గాను సందడి చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసిన బాలయ్య.. నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ లో సరికొత్త అతిథులతో ఫుల్ జోష్‌తో అద్యంతం ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. ఈ వారం నవీన్ పోలిశెట్టి.. హీరోయిన్ శ్రీ లీల షోలో సందడి చేశారు. ఇక బాలయ్య.. ఇందులో మాట్లాడుతూ ఆదిత్య 369 సీక్వెల్గా ఆదిత్య 999 రానుందని.. మోక్షజ్ఞ తేజ ఇందులో హీరోగా కనిపించబోతున్నాడు అంటూ వెల్లడించాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని వివరించాడు. తర్వాత గెస్ట్‌లుగా వచ్చిన నవీన్ పోలీశెట్టి, శ్రీ లీల తో కలిసి బాలయ్య సరదాగా సందడి చేశారు. ఇక ఇందులో బాలయ్య మాట్లాడుతూ.. నవీన్ రాజమౌళి, సందీప్ రెడ్డివంగా ఎవరు సినిమాలో హీరోగా చేయాలని ఉందని అడగగా.. నవీన్ రియాక్ట్ అవుతూ.. రాజమౌళి గారు మహేష్ గారితో ఫుల్ బిజీ. వాళ్ళిద్దరూ మరో 4 ఏళ్ళు ఖాళీగా ఉండరు. సందీప్ గారు ప్రభాస్ అన్న సినిమాతో బిజీ. వీళ్లకు రెండేళ్లు విరామం ఉండదు. ముందు సందీప్ గారు ఫ్రీ అవుతారు కనుక.. ఆయనను ఇంప్రెస్ చేసి ఛాన్స్ కొట్టేస్తా. తర్వాత రాజమౌళి గారితో సినిమా చేస్తా అంటూ వివరించాడు.
వెంటనే బాలయ్య రియాక్ట్ అవుతూ.. నేనైతే రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ వంగా మూవీలో విలన్ గా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇక నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ తన ఫ్యామిలీలో అంతా చదువుకున్న వాళ్ళని.. నేను మాత్రం నటుడవుతా అని చెప్పడంతో అంత షాక్ అయ్యారని వెల్లడించాడు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే అబ్బాయి ఏం చేస్తున్నాడని అందరూ అడగడంతో.. నా తల్లిదండ్రులు ఏ కార్యక్రమానికి వెళ్లే వాళ్ళు కాదని చెప్పుకొచ్చాడు. తను నటుడిని అయిన తర్వాత ఎవరు పిలవకపోయిన డాడీ ఫంక్షన్స్ కు వెళ్తున్నారని చెప్పి నవ్వులు పోయించాడు. నవీన్.. బాలయ్యల మధ్యన జరిగిన ఈ ఫన్నీ కాన్వర్జేషన్ ప్రోమో.. ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.