ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జరిగే మోస్ట్ రిలేటెడ్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం బ్లాక్ బాస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాక్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి.. ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధించడంపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ.. అసలు మ్యటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
పుష్ప సినిమాపై ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా ఉన్నాయని.. బన్నీ నటించినా లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఆడుతున్న.. రెండు సినిమా ధియేటర్లను గవర్నమెంట్ సీజన్ విధించారని సమాచారం. కుప్పంలో పుష్ప 2 సినిమా నడుస్తున్న లక్ష్మీ, మహాలక్ష్మి థియేటర్‌లను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం.. బన్నీ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది. టిడిపి సీనియర్ నేతకు చెందిన ఈ రెండు థియేటర్లకు అధికారులు తాళాలు వేశారు. థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా.. ఎన్బోసి సర్టిఫికెట్ కూడా లేకుండా థియేటర్లను రన్ చేస్తున్నారని.. యాజమాన్యానికి అధికారుల నోటీసులు ఇచ్చారు.
అయితే ఈ రెండు థియేటర్లలోను పుష్ప 2 సినిమానే ఆడుతుండడంతో.. ఫ్యాన్స్ వారిపై ఫైర్ అవుతున్నారు. హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లతో రాణిస్తున్న సమయంలో అధికారులు థియేటర్లను సీజ్ చేయడం సరికాదని.. బన్నీ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు ప్రేక్షకులకు సినిమా దూరం చేస్తున్నారంటూ వాపోతున్నారు. అయితే దీనిపై అధికారులు రియాక్ట్ అవుతూ.. వారు తనిఖీలు చేపట్టిన టైం లో పర్మిషన్ లేని థియేటర్లను సీజ్ చేశామని. అది కొత్త విషయం ఏమీ కాదు.. థియేటర్లు నిర్వహించడానికి ఓనర్లు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వస్తువులు, సౌకర్యాలు , పర్మిషన్లు ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అధికారుల నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ను రప్పించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయానికి గండి కొట్టేలే ఉన్న ఏ చర్యలను ఉపేక్షించలేమని.. అందులో భాగంగానే థియేటర్లు తనకి చేపట్టి పర్మిషన్ లేకపోవడంతో సీజ్ చేశామంటూ వెల్లడించారు.