చిరంజీవి కోసం ప్రభాస్ అలాంటి త్యాగం చేస్తాడా… మ్యాట‌ర్ ఇదే…!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడి బ్లాక్ బాస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ సినిమా భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు.

Sankranthi 2025: Raja Saab All Set To Join Vishwambhara?

2025 జనవరి టైంకి ఈ సినిమా షూట్ మొత్తం పూర్తవుతుందని.. అయితే సినిమాలో ఎక్కువ వీఎఫెక్స్‌ పని ఉందని.. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు అవ్వడం కష్టమే అంటూ సమాచారం. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో ప్రభాస్ సినిమాను చూసి రిలాక్స్ అవ్వచ్చు అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురుకానుందట. అయితే సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను సినిమా నుంచి రిలీజ్ చేయనున్నారని టాక్. ఇక మెగాస్టార్ విశ్వంభ‌ర‌ సంక్రాంతి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కొడుకు గేమ్ ఛేంజర్ కోసం చిరు విశ్వంభర ను పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పటికీ మేకర్స్ ప్రకటించలేదు. ఏప్రిల్ 10న‌ ఈ సినిమా రిలీజ్ కానుంది అని ఓ వార్త కొద్దిరోజులుగా తెగ వైరల్ గా మారుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్‌ వస్తుంది.

Prabhas | Wishing Our MegaStar Chiranjeevi Garu A Very Happy Birthday From Prabhas Fans ❤️ #Prabhas #PrabhasContent #ActorPrabhas #PrabhasFans... | Instagram

కాగా.. విశ్వంభరను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తుండడంతో.. మెగాస్టార్‌కు పోటీగా.. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బ‌రిలో దిగడని సమాచారం. ఇక రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ కాకపోవచ్చు అని చెబుతున్నారు. ప్రభాస్ లిస్టులో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఉన్నాయి. జ‌లార్‌ లాంటి భారీ సినిమాలోని నిర్మించిన హేంబ‌లే ఫిలిమ్స్ తో ప్రభాస్ మూడు సినిమా చేయనన్నాడు. సలార్ 2తో మరోసారి ఆ నిర్మాణ సంస్థ ప్రయాణం మొదలుకానుంది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో వరుస సినిమాలను ప్రభాస్ నుంచి విడుదల చేయ‌నున్నారు. ఇక ప్రభాస్.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా, అలాగే లోకేష్ క‌నగరాజ్‌తో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మ‌రో ప‌క్క సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌లో నటించాల్సి ఉంది. ఇంత బిజీ అయినప్పుడు చిరంజీవి కోసం ప్రభాస్ త్యాగం చేస్తాడా.. లేదా ఇద్దరి మధ్య గట్టి పోటీ రానుంద‌ వేచి చూడాలి.