టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ పీకలోతు ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎప్పుడు ఈ జంట రియాక్ట్ కాలేదు. వారి ప్రేమ వార్తలకు చెక్ పెట్టాలని అసలు అనుకోలేదు. అంతేకాదు ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ప్రైవేట్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా మీడియా కళ్ళకు చిక్కుతూనే ఉన్నాయి. ఇక ఇన్‌స్టా నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫారం వరకు.. ఎప్పటికప్పుడు సినిమా ప్రమోషన్లలో వారు ఏదో రూపంలో ఒకరిపై ఒకరి ప్రేమను చూపించుకుంటూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం.. వీరికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది.
ఈ జంట ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుతం ఎవరి సినీ కెరిర్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే.. కొద్దిరోజులుగా ఈ జంట చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లాంటిది.. క్లోజ్ డోర్స్ మధ్యలో ప్లాన్ చేస్తున్నారంటూ వార్తా వైరల్ అవుతుంది. ఈ మేరకు ఫ్యామిలీ మెంబర్ షాపింగ్ కూడా ప్రారంభించేసారని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ దేవరకొండకు ప్రశ్న ఎదురయింది. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ విజయ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా జరుగుతుంది. సంక్రాంతికి మైత్రీ మూవీస్ బ్యానర్ పై మరో సినిమా ఉంటుంది.
అది కొంత షూట్ పూర్తయ్యాక.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మరో సినిమా స్టార్ట్ కానుంది. అందుకే విజయ్ ప్రస్తుతం వాటిపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కాస్త వీలు చూసుకుని తనకు టైం కుదిరిన తర్వాత.. పెళ్లి, ఇతరత్రా కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తాడు. ఇప్పట్లో వాటిపై ఆలోచన లేదు. ఇవన్నీ పూర్తవడానికి కనీసం 6 నెలల టైం పడుతుంది అంటూ వెల్లడించాడు. దీంతో రష్మిక, విజయ్‌ల ఎంగేజ్మెంట్ న్యూస్ ఫేక్ అని తెలిపాయింది. వీళ్ళ పెళ్లికి ఇంకా చాలా సమయం పడుతుందని ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చాడు గోవర్ధన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.