సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపు లెంగ్తిగానే ఉంటాయి. అందులోనూ పుష్ప 2 మరింత ఎక్కువ. ఏకంగా 3 గంల.. 20 నిమిషాల నడివితో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను ట్రిమ్ చేయమని మేకర్స్.. సుకుమారును ఒప్పించేందుకు ప్రయత్నించిన సుకుమార్ మాత్రం దానికి ఒప్పుకోలేదట. సినిమా చూసిన తర్వాత భారీ నడివి ఉన్న సినిమా అయినా.. రెండున్నర గంటల సినిమాలు అనిపించిందని.. ఎక్కడ బోర్ కొట్టలేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక.. సినిమాను చూసిన ఆడియన్స్ కూడా రన్ టైం విషయంపై ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు.
అయితే రన్ టైం విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఈ సినిమా.. ఫైనల్ రష్ మొదటి 4 గంటల వరకు వచ్చిందట. అందులో 40 నిమిషాల ఇంట్రెస్టింగ్ సీన్స్ ను ఎడిటింగ్ లో ట్రిమ్ చేసి ఇచ్చేసాడట సుకుమార్. ఎడిటింగ్ లో ట్రిమ్ చేసిన సీన్స్ కూడా చాలా బాగున్నాయని తెలుస్తుంది. అయితే మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగం కేశవ పాత్ర నడివి చాలా తగ్గింది. దానికి కారణం ఎడిటింగ్ లో ఆయనకు సంబంధించిన చాలా సన్నివేశాలు తొలగించడమేనని తెలుస్తుంది. క్లైమాక్స్ ని ఇంకా ఎక్స్టెన్షన్ చేశారని.. చివరిలో పార్ట్-3 కి సంబంధించిన ఓ లీడ్ సీను ఉంటుందని.. దాన్ని కూడా ఎడిట్ చేసినట్లు సమాచారం.
అయితే 40 నిమిషాల సీన్స్ పార్ట్ 3 లో యూజ్ చేసుకోవడానికి.. వాటిని కట్ చేసి పక్కన పెట్టాడట సుక్కు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సన్నివేశాలు సినిమాల్లో జోడించే ఛాన్స్ ఉంది. అలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి కూడా. కానీ.. ఇప్పటికే ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 20 నిమిషాలు ఉంది. దీంతో ఎడిషనల్ సీన్స్ జోడిస్తే.. నిజంగానే ఆడియన్స్ సినిమా చూసేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. దీంతో కొత్త సన్నివేశాలను యాడ్ చేయకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారట మేకర్స్. ఇక ట్రిమ్ చేసిన సీన్లను తర్వాత సిరీస్ లో వాడతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.