పుష్ప 2 ఎఫెక్ట్‌.. డాకూ మ‌హారాజ్‌, గేమ్ ఛేంజ‌ర్‌కు పెద్ద దెబ్బే…!

తాజాగా రిలీజైన‌ పుష్ప ది రూల్ ఎలంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో అంచనాల నడుమ రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ షోలతో స‌క్స‌స్‌ఫుల్గా దూసుకుపోతుంది. కాగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌ సంధ్యా థియేటర్ వ‌ద్ద బెనిఫిట్ షో ముగిసిన త‌ర్వాత జరిగిన తొక్కిసులాటలో.. ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

అక్కడికి అల్లు అర్జ‌న్ వెళ‌డంతో అతడిని చూడడానికి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. దీంతో తొక్కిసులాట జరిగి ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఇకపై బెనిఫిట్ ర‌ద్దు చేయాలని.. నైట్ షో రిలీజ్ చేసేది లేదంటూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇకపై తెలంగాణలో ఉదయం ఏడు గంటలకే మొదటి షో పడనుంది. దీంతో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సినిమాలపై బిగ్ ఎఫెక్ట్ పడుతుంద‌న‌టంలో సందేహం లేదు.

సంక్రాంతి ఫైట్.. అటు క్లాస్.. ఇటు మాస్..! | Sankranti Release Gamechanger  vs Daku Maharaj

జనవరి 10న రాంచరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత.. జనవరి 12న బాలయ్య హీరోగా తెర‌కెక్క‌నున్న డాకు మహారాజ్, అలాగే జనవరి 14 వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తెరకెక్కనున్నాయి. ఇక వీటన్నిటిలో ముఖ్యంగా చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ భారీ బడ్జెట్లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బెనిఫిట్ షోలో నిర్ణయంతో రాబోయే కొత్త సినిమాలపై భారీ ప్రభావం పడనుందని.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌కు పెద్ద దెబ్బ అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా రాబోయే మూడు సినిమాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.