ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.. !

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాల్ చేయలే ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే ఉండనుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్.. పాన్ ఇడియా లెవెల్‌లో ఏ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుసగా అన్ని భారీ ఇండియన్‌ సినిమాలో నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ప్రస్తుతం తన చేతిలో అరడజన్ పైగా సినిమాలైనతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas' Cryptic Instagram Post Not about His Personal Life?

కాగా గతంలో ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండే హీరోయిన్లతో ప్రేమలు పడ్డాడని.. వారితో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ ఎన్నో వార్తలు వినిపించిన వాటిపై ఎప్పుడు రియాక్ట్ కాలేదు. తన పెళ్లి విషయంలోనూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెటింట హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో బాహుబలి అయిన వెంటనే ప్రభాస్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటూ తన అభిమానితో దిగిన ఫోటోను తెగ వైరల్ చేశారు. అది ఫేక్ అని తేలిపోయింది. మరి కొంత కాలానికి అనుష్క.. ప్రభాస్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటే వార్తలు వినిపించాయి. వాటిపై ఇద్దరూ మేము కేవలం ఫ్రెండ్స్ అని.. మా ఇద్దరి మధ్యన అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

Prabhas | From the tender age of 5, when I first saw you on the big screen,  I knew you weren't just another actor, you were my HERO. Through the... |  Instagram

అయినా ప్రభాస్ కానీ.. ఇటు అనుష్క కానీ.. ఇద్దరు పెళ్లి చేసుకోకపోవడంతో భవిష్యత్తులో వీళ్ళు వివాహం చేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా.. తాజాగా ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికరమైన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని కాకుండా ప్రభాస్ తన బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడని.. అంతేకాదు ప్రభాస్‌ను చేసుకునేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కూడా ఓ మంచి ఉద్యోగంలో సెటిల్ అయిందని కొందరు చెప్తున్నారు. కానీ.. ఎలాంటి ఉద్యోగం చేయని అమ్మాయినే ప్రభాస్ చేసుకోబోతున్నాడని సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ చేసుకునే అమ్మాయి మాత్రం సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదని తేలిపోయింది. ఇక అమ్మాయి ఎవరో.. కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా వేచి చూస్తున్నారు.