మనోజ్ వర్సెస్ మోహన్ బాబు.. కొట్టుకొని కేసులు పెట్టుకున్న తండ్రి, కొడుకులు..

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తులు వ్యవహారం దాడులకు కారణమవుతుందని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మోహన్ బాబుతో పాటు.. ఆయన కుమారుడు మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మొదట తండ్రి మోహన్ బాబు తనని కొట్టాడని, భార్య మౌనికపై కూడా దాడి చేశారంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మోహన్ బాబు.. మనోజ్‌ తనపై దాడి చేశాడు అంటూ రివర్స్ కేస్ పెట్టాడు.

manchu manoj: 'ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి'.. వీడియో షేర్ చేసిన  మనోజ్ | manchu-manoj-shares-a-video-related-an-issue

ఆస్తులు, స్కూల్ వ్యవహారంలో ఇద్దరు ఒకరిపై ఒకరి పరస్పర దాడులు జరుపుకున్నారని సమాచారం. ఇక మనోజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నరట. మోహన్ బాబు తనతో పాటు.. తన భార్యపై దాడి చేశాడని మనోజ్ ఆరోపణలు చేశారు. మంచు మనోజ్.. కొంతకాలంగా మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి ఉండడం లేదన్న సంగతి తెలిసిందే. ఆయన ఆస్తులు పంచేశారని తెలుస్తోంది. అయితే కొన్ని ఆస్తుల‌ విషయంలో ఇంకా వివాదం ఉందని.. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనోజ్ వాదనలకు దిగారట‌.

Manchu Manoj | కొడుకు కోడలిపై మోహ‌న్ బాబు దాడి.. దెబ్బ‌ల‌తో పీఎస్‌కు మంచు  మ‌నోజ్-Namasthe Telangana

ఆస్తుల విషయంలో తాడోపేడో తెల్చుకోవాలని.. అనుకోవడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అని అంత భావిస్తున్నారు. గతంలో ఓసారి మంచు విష్ణు, మనోజ్‌ల‌ మధ్య కూడా దాడులు జరిగిన సంఘటన తెలిసిందే. ఆ సమయంలో మంచు విష్ణు.. తన వెబ్ సిరీస్ తీస్తున్నానని.. దానికి అది పబ్లిసిటీ అని కవర్ చేశాడు. ఈసారి మాత్రం నేరుగా పోలీస్ స్టేషన్లో మ‌నోజ్ కేసు పెట్టుకోవడంతో.. ఇది రియల్ ఫ్యామిలీ డ్రామానే అని తెలిసిపోయింది. ఈ వ్యవహారంపై మంచు ఫ్యామిలీ ఎలాంటి క‌వ‌ర్ డ్రైవ్ ఇస్తారో వేచి చూడాలి.