నందమూరి హీరోలు బాలయ్య, తారక్ మధ్యన మాటలేవంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, ఎన్టీఆర్ ఒకరిని ఒకరు కలవడం లేదని.. వారు మాట్లాడుకోవడం లేదంటూ.. వార్తలు కూడా వినిపించాయి. ఒకప్పుడు మాత్రం ఈ బాబాయ్, కొడుకులు ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండేవారు. బాలయ్య కూడా ఎన్నో సందర్భాల్లో తారక్‌ను మెచ్చుకున్నారు. కగా వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో ఆది సినిమా రూపొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. ఈ సినిమాలో తారక్ పవర్ఫుల్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక బెల్లంకొండ సురేష్ ఆది తర్వాత బాలయ్యతో సినిమాను సెట్ చేసుకున్నాడు. అది కూడా వి.వి. వినాయక్ డైరెక్షన్‌లోనే.. ఆ మూవీ ఏదో కాదు చెన్నకేశవరెడ్డి. వినాయక్‌ని బాలయ్య దగ్గరకు పంపి మరి కథ చెప్పించినట్లు బెల్లంకొండ సురేష్ వెల్లడించారు. అప్పటికి బాలయ్యకు ఆది మూవీ డైరెక్టర్ వినాయక్ అని తెలియదట. కథ విన్న తర్వాత.. ఇతనే ఆది డైరెక్టర్ అని చెప్పా. ఆది సూపర్ హిట్ మూవీ అని బాలయ్యకు తెలుసు. కానీ ఇంకా నేను సినిమా చూడలేదట. ఇతనే అది డైరెక్టర్ అని సురేష్ చెప్పగానే ముందే చెప్పాలి కదా అని బాలయ్య అన్నాడట. ఆది మూవీ నాకు స్పెషల్ షో వేయండి అని బాలయ్య స్వయంగా ఆడికి ప్రసాద్ ల్యాబ్స్ లో వేయించుకొని సినిమా చూశాడట.
సినిమా చూసిన తర్వాత వెంటనే తారక్‌కు ఫోన్ కలపండి అని ఆర్డర్ వేసాడట. బాలయ్య ఫోన్ చేసి ఎన్టీఆర్ ని అభినందించాడట. అప్పుడు తారక్ అల్లరి రాముడు షూటింగ్‌లో ఉన్నాడని.. రేయ్ బాగా చేసావురా బ్రహ్మాండంగా ఉంది. టాప్ పర్ఫామెన్స్.. కంగ్రాట్స్ అంటూ బాలయ్య తారక్‌ను పొగడ్తలతో ముంచేసాడట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలయ్య కల్మషం లేని వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకు ఏ టైం లో మనసుకు ఏది అనిపిస్తే అది వెంటనే చేసేస్తారు. లేదా చెప్పేస్తారు. అసలు దాచుకోరు.. కోపమైన, ప్రేమైనా అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సురేష్.